వర్మ మీద ‘సాక్షి’ వల్లమాలిన ప్రేమ…

కపట ప్రేమ, దృతరాష్ట్ర కౌగిలికి నిలువెత్తు నిదర్శనం సాక్షి. ఈ సాక్షిలో వచ్చే విచిత్ర కథనాలు, అసత్య ప్రచారాలు ఒక్క వైసీపీ మద్దతుదారులకు తప్ప మరొకరికి రుచించవు. సాక్షి పత్రిక లో వచ్చే ఒక్క తేదీ, కోడిగుడ్డు ధరలు మాత్రమే వాస్తవాలు, మిగిలినవన్నీ ఒట్టి కట్టు కథలు, కల్పిత గాథలే అంటూ వైసీపీ ప్రత్యర్థి పార్టీల నాయకులు ఆరోపిస్తుంటారు.

ADVERTISEMENT

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విచ్ఛిన్నానికి కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వైసీపీ శ్రేణులకు క్షణికానందాన్ని ఇవ్వడానికి సాక్షి నిరంతరం తనవంతు కృషి తానూ చేస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగా ఇప్పుడు పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ మీద సాక్షి తన వల్లమాలిన కపట ప్రేమను ప్రదర్శిస్తుంది.

కూటమి పొత్తుతో వర్మ రాజకీయ జీవితం సమాదయ్యింది, జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం వర్మ చేసిన త్యాగానికి ఆయన అన్న నాగబాబు వర్మకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఇదే అంటూ జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తుంది. అలాగే పనిలో పనిగా ఇటు పవన్ మీద కూడా తన అక్కసు వెళ్లగక్కింది.

తన కోసం సీటు త్యాగం చేసిన వర్మను పక్కన పెట్టి తన అన్న నాగబాబు ని దొడ్డిదారిన ఎమ్మెల్సీ తో ప్రభుత్వంలోకి తీసుకోవాలనుకోవడం పవన్ వెన్నుపోటు రాజకీయం కాదా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంది సాక్షి. అలాగే ఇటు పవన్ ను, అతని అన్న నాగబాబు ని తిడుతూనే మరో పక్క టీడీపీ అధినేత చంద్రబాబు మీద విషం చిమ్ముతుంది సాక్షి.

బాబు ని నమ్మితే ఇక రాజకీయ సన్యాసమే, నమ్మించి మోసం చేయడం, అవసరం తీరాక పక్కన పెట్టడం బాబుకి వెన్నతో పెట్టిన విధ్యే అంటూ రెచ్చిపోయిన సాక్షి తన అధినేత జగన్, తన సొంత చెల్లి షర్మిల, తల్లి విజయలక్ష్మి పట్ల చేసిన రాజకీయ ద్రోహాన్ని విస్మరించింది.

అలాగే తన సొంత చిన్నాన్న వివేకా గొడ్డలి వేటును గుండె పాటుగా మార్చిన చరిత్రను కప్పిపుచ్చుకుంటున్న సాక్షికి టీడీపీ, జనసేన పార్టీల గురించి మాట్లాడే నైతికత ఉంటుందా.? ఎటువంటి పొత్తులు లేకున్నా పార్టీ కోసం కాళ్లరిగేలా తిరిగిన చెల్లికి కనీసం తన ఆపార్టీలో ఒక గుర్తింపు కానీ ఒక గౌరవప్రదమైన స్థానం కానీ కల్పించలేని జగన్ ఇప్పుడు మాత్రం మూడు పార్టీల పొత్తులో భాగమైన కూటమి ప్రభుత్వం పై, ఆయా పార్టీల అంయకుల పదవుల పై మాత్రం నీతి ప్రవచనాలు వల్లెవేస్తున్నారు.

పొత్తులో భాగంగా ఆ మూడు పార్టీల మధ్య ఆ పార్టీల నాయకుల మధ్య జరిగే అంతర్గత విషయాల మీద రాజకీయం చేసి వైసీపీ కి ఎదో మంచి చెయ్యాలనే సాక్షి ఆరాటం కూటమిని విచ్చిన్నం చెయ్యలేదు అనేది సాక్షి గ్రహించలేకపోతుంది. అలాగే వర్మ కూడా ఇప్పటి వరకు కూటమి తనకు అన్యాయం చేసింది, చేస్తుంది అంటూ ఎక్కడ కూటమికి వ్యతిరేకంగా రాజకీయ ప్రకటన ఇవ్వలేదు.

అయినా కూడా వర్మ ను అతని అనుచరులను రెచ్చకొట్టి టీడీపీ, జనసేనల మధ్య రాజకీయ చిచ్చు పెట్టి తద్వారా వైసీపీ లబ్ది పొందాలి చూడడం సాక్షి ముఖ్యఉద్దేశం. అందులో భాగంగానే ఈ బూటకపు ప్రేమలు సాక్షిలో ప్రత్యక్షమవుతున్నాయి. 2024 ఎన్నికలకు ముందే వైసీపీ SVSN వర్మ ను తమ పార్టీలోకి ఆహ్వానించడానికి రాయబారాలు జరిపిన వైసీపీ అతని నుండి తిరస్కరనను ఎదుర్కొంది.

దీనితో ఇప్పుడు వర్మ కు ఎదురైనా ఈ రాజకీయ నిరుద్యోగాన్ని తనకు అనుకూలంగా మలచుకుని వర్మను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది వైసీపీ. మరి ఈ సారి వైసీపీ తరపున సాక్షి చేస్తున్న ఈ బహిరంగ రాయబారాలు ఫలితాలిస్తాయా లేక గతం మాదిరే అవమాన భారంతో వైసీపీ వెనుతిరుగనుందా అనేది వేచి చూడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

నింగిలో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌, నేలపై ఆర్టీసీ డ్రైవర్ శివ!

ఇండియన్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కోపైలట్ కాక్‌పిట్‌లో కత్తితో దాడి చేస్తున్నప్పుడు ఓ పక్క అతని కత్తిపోట్లు ఎదుర్కొంటూనే…

11 minutes ago

నా కుట్రలు ఫలించాయి కూటమి విచ్చినం అయ్యింది!

జీవిత చరిత్రలు వ్రాసుకునే ప్రముఖులు తమ గొప్పలు చెప్పుకోవడానికే ఇష్టపడతారు తప్ప చేసిన తప్పులు, అసమర్ధత గురించి చెప్పుకోవడానికి ఇష్టపడరు.…

39 minutes ago