సలార్ ప్రభాస్ కెరీర్ లో ఈ మధ్య కాలంలో మోస్ట్ హైపడ్ సినిమా… కేజీఎఫ్ 2 తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తుంది. సెప్టెంబర్ 28న విడుదలకు సిద్ధం అవుతుంది. అంటే సరిగ్గా నేటి కి నెల రోజుల టైం ఉంది ఇంకా.
సినిమా నుండి ఒక టీజర్ ఇప్పటికే విడుదల చేశారు. అది బాగానే ఉన్నా హైప్ పెంచేలా అయితే లేదు అనే ఫ్యాన్సే అంటున్నారు. ఇక సినిమాలో పాటలు కూడా విడుదల చేసే ఉద్దేశం టీమ్ కి లేదని, డైరెక్ట్ ట్రైలరే అంటున్నారు.
ఇకపోతే సినిమాని నిర్మిస్తున్న హంబాలే ఫిలిమ్స్ ఒక్క తెలుగు వెర్షన్ నుండే 200 కోట్లకు పైగా ఆశిస్తుంది. అయితే ఈ చర్చలు రెండు నెలల నుండి జరుగుతున్నా బయర్లు సాహసించడం లేదు.
సీడెడ్ విషయానికి వస్తే నిర్మాతలు ముందు 40 కోట్లు అడిగారు. అయితే బయర్లు ముందుకు రాకపోవడంతో ఆ రేటు 27 కోట్లకు చేరింది. అయినా బయర్లు లేరు. దాదాపుగా అన్ని చోట్లా ఇదే పరిస్థితి. అయితే ట్రైలర్ వచ్చాకా పూర్తిగా పరిస్థితి మారిపోతుందని నిర్మాతలు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
అప్పటికీ పరిస్థితి మారకపోతే కేజిఎఫ్ 2, కాంతారా సినిమాల లాగా సొంతంగా రిలీజ్ చేసుకుంటారు.
ఆ రెండు సినిమాలు కొద్ది పాటి కమిషన్ ఇచ్చి అడ్వాన్సులు తీసుకోకుండా విడుదల చేశారు హంబాలే ఫిలిమ్స్. ఆ తరువాత పెద్ద స్థాయిలో లాభాలు గడించారు.
అవసరమైతే ఆ పరిస్థితి కి కూడా నిర్మాతలు రెడీ గానే ఉన్నారు.
బాహుబలి తరువాత ప్రభాస్ కు పాన్-ఇండియా స్థాయిలో ఆ రేంజ్ హిట్ పడలేదు. దానితో ప్రభాస్ ఈ సినిమా మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు. భారీ ఓపెనింగ్ అయితే గారంటీ అయితే ఫుల్ రన్ లో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 రికార్డులే టార్గెట్.



