పవన్ కళ్యాణ్ కంగారు… అటువంటిది ఏమీ జరగలేదు

Salaar - PSPK27కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, విడుదల తేదీ మహా శివరాత్రి సందర్భంగా వస్తాయని నిర్మాతలు ప్రకటించారు. కాగా ఈరోజు ఉన్నట్టుండి ప్రభాస్ తదుపరి చిత్రం… సలార్ విడుదల తేదీ ప్రకటన సాయంత్రం ఉంటుందని చిత్రబృందం ప్రకటించింది. సలార్ సంక్రాంతికి వస్తుందన్న కంగారులో ఉన్నఫళంగా పవన్ కళ్యాణ్ సినిమా విడుదల ప్రకటన చేశారు.

ADVERTISEMENT

తమ సినిమా 2022 సంక్రాంతికి రానున్నట్టు ప్రకటించారు. అయితే ఆ తరువాత సలార్ ప్రకటన వచ్చింది. అయితే సంక్రాంతికి కాకుండా 2022 వేసవి స్పెషల్ గా ఏప్రిల్ 14న తమ సినిమా విడుదల కానున్నట్టు సలార్ బృందం ప్రకటించింది. దీనితో పవన్ కళ్యాణ్ సినిమా కంగారు పడింది గానీ అటువంటిది ఏమీ జరగలేదు.

ఈ రెండు సినిమాల విడుదల ప్లాన్ల ప్రకటనతో నాలుగు సినిమాలు 2022లో తమ రిలీజ్ స్లాట్లు బుక్ చేసుకున్నట్టుగా అయ్యింది. ఇప్పటికే 2022 సంక్రాంతికి మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా… అదే ఏడాది ఆగష్టు 11న ప్రభాస్ ఆదిపురుష్ విడుదల కానున్నట్టు ఆయా చిత్రబృందాలు ప్రకటించాయి.

ఆ రకంగా 2022లో ప్రభాస్ సినిమాలు రెండు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇది అలా ఉండగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ కూడా సంక్రాంతి 2022 కు వాయిదా పడే అవకాశం ఉందని వినిపిస్తుంది. అదే నిజమైతే ముందుకు బుక్ చేసుకున్న సినిమాలు తమ రిలీజ్ ప్లాన్లలో మార్పులు చేర్పులు చేసుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories