కెజిఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ సినిమా కంటెంట్ పరంగా చాలా ఇష్యూస్ ఉన్నా ‘యాక్షన్’ ఎపిసోడ్స్ మాత్రం ఫుల్ మీల్స్ పెట్టేశాయి అందుకే ఈ కలెక్షన్స్.
మరి ఇంకో రెండు వారాల తర్వాత రాబోతున్న సంక్రాంతి సినిమాలని ఇప్పుడే ఒక సలార్ లాంటి డిఫరెంట్ సెటప్, స్కేల్ యాక్షన్ మూవీ చూసిన ప్రేక్షకులు అదే కళ్ళతో చూడగలరా?
రెగ్యులర్ బ్యాక్ డ్రాప్ లో ఉండే సినిమాలు ఇంత తక్కువ గ్యాప్ లో వచ్చి ప్రేక్షకులని ఆకట్టుకోగలవా? ముఖ్యంగా త్రివిక్రం నుంచి రాబోతున్న గుంటూరు కారం, దీని నుంచే ప్రేక్షకులు కొత్తదనం, యాక్షన్ ఆశించేది. ఈ ప్రశ్న ఫాన్స్ లోనే కాదు, ఒక సెక్షన్ ఆఫ్ ట్రేడ్ లో కూడా ఉంది.
కొంచెం వెనక్కి వెళ్లి చూస్తే బాహుబలి వచ్చాక శ్రీమంతుడు లాంటి సినిమా ఆనుద్దా అనుకుంటే, అది ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.
ఇంకా చెప్పాలంటే జనాలకి సలార్ లాంటి స్కేల్ సినిమా మరో కమర్షియల్ సినిమా చూడటానికి మోటివేషన్ క్రియేట్ చేస్తది. కానీ సినిమా లో అయితే కనీసం లో కనీసం కంటెంట్ అయితే ఉండాలి, రేంజ్ రావాలంటే శ్రీమంతుడు లాగా మెప్పించే పాటలు,యాక్షన్, డ్రామా అయితే పండాలి.
అయితే ఒకటి మాత్రం వాస్తవం, రోజులు చాలా మారాయ్ అప్పటికీ ఇప్పటికీ, సలార్ తో గుంటూరు కారం ని కంపేర్ చేసే సెక్షన్ కూడా ఉంటారు కానీ, అవేవీ పెద్ద సమస్యలు అయితే అవ్వవు. అయినా సలార్ ఏమీ అంత ఫుల్ మీల్స్ లాంటి బ్లాక్ బస్టర్ కంటెంట్ ఉన్న బొమ్మేమీ కాదుగా.




