‘బ్రహ్మోత్సవం’ కారణంగా క్షమాపణలు చెప్పిన సమంత!

Samantha Apology for not attending 24 Audio launch‘కుందనపు బొమ్మ’ సమంత “24” చిత్ర యూనిట్ కు క్షమాపణలు చెప్పింది. సూర్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన సైంటిఫిక్ యాక్షన్ మూవీ “24” సినిమా ఆడియోకు హాజరు కాలేకపోతున్నానని, ఇందుకు క్షమించాలని ట్వీట్ చేసింది. ప్రస్తుతం “బ్రహ్మోత్సవం” సినిమా చివరి షెడ్యూల్ లో ఉన్నానని, అందుకే హాజరు కాలేకపోతున్నానని వివరణ ఇచ్చుకుంది.

ఈ ఏడాది సమ్మర్లో విడుదల కాబోతున్న రెండు ప్రతిష్టాత్మక చిత్రాలలోనూ సమంతనే కధానాయిక. అటు తమిళంలో ‘24’ సినిమాలోనూ, ఇటు తెలుగులో ‘బ్రహ్మోత్సవం’ సినిమాలోనూ కీలక పాత్రలు పోషిస్తోంది. ఒకటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాగా, మరొకటి సైంటిఫిక్ థ్రిల్లర్ వంటి రెండు విభిన్న పాత్రలలో నటిస్తున్న సమంతకు ఇటీవల విజయాలు దూరమైన నేపధ్యంలో “24, బ్రహ్మోత్సవం” సినిమాల సక్సెస్ చాలా కీలకంగా మారాయి.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories