‘జెస్సీ’ అభిమానులకు గుడ్ న్యూస్!

Samantha Marriage Preponed newsఅక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్-శ్రియా భూపాల్ ల‌ పెళ్లి ర‌ద్దు కార‌ణంగా చెన్నై బ్యూటీ సమంత – నాగ‌చైత‌న్య‌ల వివాహం అనుకున్న దాని క‌న్నా కాస్త ముందుగానే జ‌రగనుంద‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రాంచ‌ర‌ణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో సమంత తప్పుకుందన్న వార్తలతో, ‘కుందనపు బొమ్మ’ అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు.

దీంతో ఈ సినిమాలో హీరోయిన్ ఎవర‌నే వార్త‌ల‌పై ఈ రోజు ఆ చిత్రం యూనిట్ స్పందిస్తూ… ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 20 నుంచే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమవుతుందని, అలాగే ఈ నెల‌ 22 నుంచి సమంత షూటింగ్ లో పాల్గొంటుంద‌ని స్ప‌ష్ట‌త‌ ఇచ్చింది. ఈ ఏడాది జులై చివరికి క‌ల్లా ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేయాలని యోచిస్తున్న ఈ సినిమా పాటలను దేవిశ్రీ ప్రసాద్‌ ఇప్పటికే పూర్తి చేసినట్లుగా తెలిపారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories