సైలెంట్ గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన సమంత

Samantha Pregnancy Buzz

గతేడాది డిసెంబర్ లో రాజ్ నిడిమోరుని రెండో వివాహం చేసుకున్న సమంత కొన్నాళ్లు షూటింగ్ నుండి బ్రేక్ తీసుకోవడం, మొన్న సినిమా ప్రమోషన్స్ అన్నిట్లోనూ చీరలోనే కనిపించినప్పుడే చాలామంది సమంత ప్రెగ్నెంట్ అనుకున్నారు. ఆ వార్త, ఊహాగానాలు వైరల్ అవ్వడంతో.. ఇంకెందుకు దాయాలి అనుకుందో ఏమో.. ఇవాళ హైద్రాబాద్ లోని ఏషియన్ సినిమాస్ ఆఫీస్ లో జరిగిన “మా ఇంటి బంగారం” సక్సెస్ మీట్ కి మాత్రం సింపుల్ వైట్ అండ్ టైట్ టీషర్ట్ లో దర్శనమిచ్చింది.

ఆ టీషర్టులో సమంత ప్రెగ్నెంట్ అని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాజ్ కూడా ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నిర్మాతగా, హీరోయిన్ గా సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్న సమంత ఇప్పుడు భార్యగా, తల్లిగానూ సూపర్ హ్యాపీ కాబోతోంది. జూలై లేదా ఆగస్ట్ లో సమంత తొలి శిశువుకి ప్రసవం చేసే అవకాశాలు ఉన్నాయి.

ADVERTISEMENT

ఇకపోతే.. “మా ఇంటి బంగారం” ఓవర్సీస్ లో 1 మిలియన్ టచ్ చేయడానికి రెడీగా ఉండగా, తెలుగు రాష్ట్రాల్లో బ్రేకీవెన్ కి దగ్గరగా ఉంది. దాంతో ఇప్పుడు సమంత యాక్సెప్ట్ చేయకపోయినా ఆమెను లేడీ సూపర్ స్టార్ ఆఫ్ తెలుగు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ADVERTISEMENT
Latest Stories