సమంత ‘రిలేషన్ షిప్’ అడ్వైజ్ శోభితకు కౌంటర్ అయ్యిందే!

Samantha and Shobhita statements

సమంత కావాలని అన్నదో లేక క్యాజువల్ గా అన్నదో తెలియదు కానీ.. నిన్న “మా ఇంటి బంగారం” సక్సెస్ ఈవెంట్లో సమంత రిలేషన్ షిప్ లో ఎలాంటి పార్ట్నర్ ని ఎన్నుకోవాలి అని ఇచ్చిన స్టేట్మెంట్.. డైరెక్ట్ గా శోభితకి కౌంటర్ అయ్యింది. అది కూడా వర్డ్ టు వర్డ్. కాకతాళీయం అనే మాట కూడా ఇక్కడ వాడడానికి లేదు. కావాలని చాలా క్యాల్క్యులేటడ్ గా ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్లయింది సమంత.

ఇక విషయానికి వస్తే.. నిన్న సక్సెస్ మీట్ లో “రిలేషన్ షిప్స్ విషయంలో యువతకు, ముఖ్యంగా అమ్మాయిలకి మీరిచ్చే మోటివేషన్ ఏంటి?” అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకి సమాధానంగా సమంత.. “నీకు కాబోయేవాడు వచ్చి.. నిన్ను సంపూర్ణం చేస్తాడు అని ఎప్పుడూ అనుకోకు. ముందు నువ్వు సంపూర్ణంగా ఉండి, తర్వాత ఒక పార్ట్నర్ ని వెతుక్కో.. అప్పుడు రిలేషన్ షిప్ సక్సెస్ అవుతుంది” అని సమంత స్టేట్మెంట్ ఇచ్చింది. అక్కడిదాకా అంతా బాగానే ఉంది. అయితే.. ఈ స్టేట్మెంట్ కరెక్ట్ గా శోభిత తాను నాగచైతన్యను పెళ్లాడుతున్నప్పుడు ఇచ్చిన ఓ స్టేట్మెంట్ కి కౌంటర్ గా ఉండడం అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.

ADVERTISEMENT

నాగచైతన్యతో పెళ్లి సందర్భంలో తీసిన స్పెషల్ వీడియోలో శోభిత మాట్లాడుతూ.. “నన్ను నాగచైతన్య సంపూర్ణం చేస్తాడు” అని ఆనందంలో చెబుతుంది. నిన్న సమంత ఇచ్చిన స్టేట్మెంట్ ఈ డైలాగ్ కి కౌంటర్ లా ఉంది. మరి సమంత కావాలనే అన్నదా లేక తెలియకుండా అనేసిందా అనేది తెలియదు కానీ.. ప్రస్తుతానికైతే ఈ రెండు స్టేట్మెంట్స్ సోషల్ మీడియా మొత్తం చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పుడు సమంతకి మళ్లీ శోభిత కానీ నాగచైతన్య కానీ కౌంటర్ ఇస్తారా అంటే లేదనే చెప్పొచ్చు. ఎందుకో శోభిత పెళ్ళి తర్వాత సమంతను టార్గెట్ చేసేలాగో లేక ఆమెను కించపరిచేలాగా ఒక్కటంటే ఒక్క స్టేట్మెంట్ కూడా చేయలేదు. నాగచైతన్య కూడా అంతే.. సమంతను ఉద్దేశించి ఒక్క నెగిటివ్ విషయం కూడా మాట్లాడలేదు. మరి ఈ వన్ సైడ్ కోల్డ్ వార్ ఎప్పడు ముగుస్తుంది అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories