కష్టాలను దాటిన సమంత.. అందరికీ స్ఫూర్తి

Samantha Raj Nidimoru Baby

రాజ్ నిడిమోరు, సమంత దంపతులకు నవంబర్‌ 19న మగ శిశువు జన్మించాడు. ఈ విషయం ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

ఆమె తన నిజ జీవితంలో కూడా అనేక ‘సినిమా కష్టాలు’ అనుభవించిన తర్వాత మళ్ళీ మంచి రోజులు వచ్చినట్లే ఉన్నాయి. ఆమె ఎదుర్కొన్న సమస్యల గురించి అందరికీ తెలుసు కనుక మళ్ళీ ఆ ప్రస్తావన అనవసరం.

ADVERTISEMENT

మన సమాజంలో చిన్న చిన్న సమస్యలు, కారణాలతోనే ఆత్మహత్యలు చేసుకునేవారు, వ్యసనాలకు లోనయ్యి జీవితాలు పాడు చేసుకునేవారు లక్షల మంది ఉన్నారు. వారు తమ జీవితాలు పాడు చేసుకోవడమే కాకుండా కుటుంబ సభ్యులకు తీరని ఆవేదన కలిగిస్తుంటారు

కానీ ఒకదాని తర్వాత మరొకటి వరుసగా కష్టాలు తరుముకొస్తున్నప్పుడు, సమంత కూడా మొదట తడబడినప్పటికీ, తేరుకొని ధైర్యంగా ఒంటరి పోరాటం చేశారు.

ఆ పోరాటంలో కూడా ఆమెకు సహకరించినవారి కంటే విమర్శించినవారు, ఆమె గురించి చాలా చులకనగా మాట్లాడినవారే ఎక్కువ. కనుక ఆవిధంగా కూడా ఆమె అనేక కొత్త సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. అయినా ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకే సాగారు.

అటువంటి సమయంలో కూడా మనిషి ధైర్యం కోల్పోకుండా నిబ్బరంగా ముందుకు సాగితే, పైనున్న ఆ దేవుడు కూడా తప్పకుండా ఏదో రూపంలో సాయపడతాడని రాజ్ నిడిమోరుతో పరిచయం, ప్రేమ, పెళ్ళి ద్వారా నిరూపితమైంది. ఇప్పుడు ఆమెకు బిడ్డ పుట్టడంతో జీవితం పరిపూర్ణమైంది. ఆమె సినీ జీవితం కూడా మళ్ళీ గాడిన పడింది.

అంటే కష్టాలు వచ్చినప్పుడు క్రుంగిపోకుండా నిలబడి పోరాడితే ఇలాంటి మార్పు, మంచిరోజులు వచ్చే అవకాశం ఉంటుందని అర్ధమవుతోంది.

కనుక జీవితంలో ఎదురయ్యే సమస్యలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు లేదా వ్యసనాలకు బానిసగా మారి జీవితాలు పాడు చేసుకుంటున్నవారు తప్పకుండా సమంతని స్పూర్తిగా తీసుకొని, తమ జీవితాలలో ఎదురవుతున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని పోరాడి జీవితాలను చక్కదిద్దుకునేందుకు గట్టిగా ప్రయత్నించాలి.

ADVERTISEMENT
Latest Stories