
‘చారి’ అంటే ఎవరనుకుంటున్నారా… ఎవరో కాదు… తెలుగు సిల్వర్ స్క్రీన్ కు ‘సంపూర్ణేష్ బాబు’గా పరిచయమైన హీరో గారి అసలు పేరు నరసింహాచారి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఒరిజినల్ అవతరాన్ని ఈ ‘చారి’ కం ‘బాబు’ రివీల్ చేసి అందరికీ ఓ ‘ట్విస్ట్’ ఇచ్చారు. ఇండస్ట్రీలో కొత్త ‘బాబు’ అవసరమైన తరుణంలో, ‘హృదయ కాలేయం’ దర్శకుడు స్టీఫెన్ శంకర్, సృష్టించిన పేరే ఈ సంపూర్ణేష్ ‘బాబు’ అని తెలిపారు.
ఈ పేరు చెప్పగానే తనకు కూడా చాలా కొత్తగా అనిపించిందని, అలాగే ఇండస్ట్రీకి ‘సంపూర్ణేష్ బాబు’గా పరిచయమయ్యాననిని, అలాగే అంతకు ముందు చెప్పినట్లు తాను ‘ఎన్ఆర్ఐ’ కాదని, ఆర్ధిక బాధలతో ఇబ్బంది పడే ఓ నిరుపేద కుటుంబం నుండి వచ్చిన వ్యక్తినని, సిద్ధిపేటకు చెందిన తాను, ఇప్పటికీ రోజు అక్కడి నుండే వస్తుంటానని, ప్రయాణానికి ఎక్కువ శాతం బస్సులలోనే తిరుగుతుంటానని తన రియల్ ఫ్యాక్ట్స్ బయటపెట్టారు.
అయితే ఏదో మోసం చేయాలని మాత్రం అలా చెప్పలేదని, కేవలం ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకుని ఎన్ఆర్ఐ అంటే ఆ విలువ ఉంటుందనే ఉద్దేశంతో చెప్పినవే తప్ప, వేరే భావం లేదని, దీన్ని ఎవరైనా మోసం అనుకుంటే తనను క్షమించాలని ఈ సందర్భంగా కోరారు సంపూ. అదేలేండి… నరసింహాచారి. అయితే ఈ ‘బాబు’ కటౌట్ చూస్తే… నరసింహా చారి అన్న పేరు కంటే సంపూర్ణేష్ బాబు అన్న పేరే బాగా సూట్ అయినట్లుగా ఉంది!
After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…
Happy Journey features an unusual ensemble led by seven female characters- Annapurnamma, Amani, Anchor Jhansi,…