
తాజాగా సుమంత్ హీరోగా “మళ్ళీ రావా” మరియు కమెడియన్ సప్తగిరి ప్రధాన పాత్రలో “సప్తగిరి ఎల్.ఎల్.బి” సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రామిసింగ్ రీమేక్ గా భావించిన సప్తగిరి సినిమాతో పాటు, హిట్ కోసం పరితపిస్తున్న సుమంత్ సినిమా కూడా ఆశించిన మేర ప్రేక్షకులను ఆకట్టుకోవడం విఫలం కావడంతో, వచ్చే వారం సినిమాల వైపుకు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
అయితే వచ్చే వారం కూడా దాదాపుగా ఇదే తరహా కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి గానీ, ఈ ఇయర్ ఎండ్ లో మాత్రం నాని “ఎంసీఏ” సినిమాతో అసలు సందడి మొదలు కానుంది. వరుసనే అఖిల్ “హలో” మరియు విఐ ఆనంద్ “ఒక్క క్షణం” సినిమాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మూడింటి హంగామా సంక్రాంతి వరకు వుంటే, ఆ తర్వాత మిగిలినది “అజ్ఞాతవాసి” చూసుకుంటాడు.
Nitesh Tiwari’s Ramayana is arriving at the theatres next week. Notably, the movie was marketed…
Reports about Prabhas reuniting with Darling director Karunakaran may turn out to be false. Initial…