ఏం వాడకం గురూ… సర్ధార్… నువ్వు కేకేహే..!

sardaar gabbar singh menu in Bhimavaram Restaurant పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ క్రేజ్ ను ఎలా వాడుకోవాలో ఉభయ గోదావరి జిల్లా వాసులకు తెలిసినంతగా మరొకరికి తెలియదని నిరూపించుకుంటున్నారు. ఇటీవలే మొగల్తూరు ధియేటర్లో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ విడుదల రోజున ఉచితంగా కూల్ డ్రింక్స్ ఇస్తామంటూ ఓ ధియేటర్ యాజమాన్యం ఫుల్లుగా పబ్లిసిటీ ఇచ్చిన వైనం చూసాం. అయితే తాజాగా ‘సర్ధార్’ను వాడేసుకోవడం ఓ రెస్టారెంట్ వంతు వచ్చింది.

భీమవరంలో ‘చిల్లీస్’ పేరుతో గల రెస్టారెంట్ లో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ వారి ఆఫర్ అంటూ ఓ బ్రోచర్ ని ప్రింట్ చేసారు. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కు సంబంధించిన ఆఫర్లతో కూడిన బ్రోచర్ లో ‘మా ఆఫర్ కు కొంచెం తిక్కుంది… కాని దానికో టేస్ట్ ఉంది’ అంటూ పవర్ స్టార్ ‘గబ్బర్ సింగ్’ డైలాగ్ ను కూడా ప్రచురించి, అభిమానులను ఉత్సాహపరుస్తున్నారు. ఇంకా ‘సర్ధార్’ స్పైసీ రైస్ అంటూ ప్రత్యేకతలు కూడా ఉన్నాయి మరి!

ADVERTISEMENT

చూడబోతుంటే… కాదేదీ సర్ధార్ వాడకానికి అనర్హం అనేలా ఉన్నారు… ఉభయ గోదావరి జిల్లా వాసులు…!

ADVERTISEMENT
Latest Stories