కొండారెడ్డి కోట ముందు గొడ్డలి పట్టిన మహేష్ బాబు

Sarileru Neekevvaruసంక్రాంతి సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సరికొత్త పోస్టర్ దసరా సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా కోసం ప్రఖ్యాత కొండారెడ్డి బురుజు కోట గురించి అంతా మాట్లాడుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సెట్ ముందే గొడ్డలి పట్టుకుని మహేష్ బాబు ఉన్న పోస్టర్ ని విడుదల చేశారు.

డాషింగ్ లుక్ తో మహేష్ బాబు అభిమానులను పిచ్చెక్కించారు. ఈ పోస్టర్ తో వారి అంచనాలు మరింత పెరిగాయి అనడంలో ఎటువంటి అనుమానం లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమాలో మహేష్ బాబు తొలిసారిగా ఆర్మీ మేజర్ గా కనిపించనున్నారు.

ADVERTISEMENT

సంక్రాంతి బరిలో బన్నీ అల వైకుంఠపురములో సినిమాతో పోటీ పడుతుంది. రజినీకాంత్ దర్బార్, కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా, శర్వానంద్ శ్రీకారం కూడా సంక్రాంతికే విడుదల అవుతున్నాయి. ఈ సినిమా ద్వారా విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. 13 ఏళ్ల తరవాత ఆమె మళ్లీ తన ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారు.

బండ్ల గణేష్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. బండ్ల గణేష్ చివరి సారిగా 2012లో విడుదలైన బిజినెస్ మాన్ సినిమాలో నటించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటిదాకా చిన్న హీరోల తో పని చేసిన ఆమె ఈ చిత్రంతో పై స్థాయికి వెళ్లబోతుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణగా కనిపించబోతున్నారు.

ADVERTISEMENT
Latest Stories