‘పెన్నీ’కి దాసోహం అంటోన్న రికార్డులు!

Mahesh-Babu Sarkaru Vaari Paata Penny Song“సర్కార్ వారి పాట” సినిమా నుండి రిలీజ్ అయిన సెకండ్ సాంగ్ ‘పెన్నీ’ సంగీత ప్రియులను ఓ రేంజ్ లో అలరిస్తోంది. ఆదివారం నాడు రిలీజ్ అయిన ఈ పాటకు శ్రోతలంతా నీరాజనం పలకడంతో యూట్యూబ్ రికార్డులు కూడా దాసోహం అంటున్నాయి.

ఇప్పటికే 10 మిలియన్ క్లిక్స్, 500K లైక్స్ ను దాటి ఆల్ టైం రికార్డు దిశగా దూసుకుపోతోంది. అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం క్యాచీగా ఉండడంతో పాటు థమన్ అందించిన బీట్స్ సంగీత ప్రియులను డ్యాన్స్ లు వేయిస్తోంది. దీంతో ప్రస్తుతం రీల్స్ నిండా ‘పెన్నీ’ సాంగ్ సందడి చేస్తోంది.

ADVERTISEMENT

ఇటీవల కాలంలో ఇంత బీట్ ఉన్న పాటలు రాకపోవడంతో, మరోసారి థమన్ పేరు మారుమ్రోగుతోంది. ఇక సూపర్ స్టార్ మహేష్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేకుండా పోతున్నాయి. ‘దూకుడు, బిజినెస్ మెన్, ఆగడు’ ఆల్బమ్స్ తర్వాత మరోసారి ‘సర్కార్ వారి పాట’కు థమన్ బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారని పండగ చేసుకుంటున్నారు.

లిరికల్ సాంగ్ లో సితార పాప కనిపించి, థమన్ బీట్స్ అదిరిపోయేలా కాలు కదపడం కూడా ఈ లిరికల్ సాంగ్ పట్ల వీక్షకులు ఫిదా అయిపోవడానికి ఓ కారణం. మొత్తమ్మీద విడుదలైన రెండు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించడంతో, “సర్కార్ వారి పాట” యూనిట్ మాత్రం ఫుల్ ఖుషీలో ఉంది.

ADVERTISEMENT
Latest Stories