
మహేష్ లేటెస్ట్ గా చేస్తోన్న “సర్కార్ వారి పాట” మాత్రం మాస్ కు కిక్ ని ఇచ్చే విధంగా ఉంటుందని అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. గతంలో రిలీజ్ అయిన టీజర్ అందుకు తగ్గట్లుగా ఉండడంతో, ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. ఇక పాటలు కూడా అంతే మాస్ గా ఉంటాయని భావించగా, విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ ‘కళావతి’ పక్కా క్లాస్ స్టెప్పులతో అదరగొట్టింది.
యూట్యూబ్ లో ఇప్పటికి 90 మిలియన్ క్లిక్స్ ను దాటి దూసుకుపోతోన్న ‘కళావతి’ తదుపరి సాంగ్ కోసం నిరీక్షిస్తోన్న ఫ్యాన్స్ కు ఎట్టకేలకు చిత్ర యూనిట్ తీపికబురును అందించింది. ‘పెన్నీ’ అనే సెకండ్ సింగిల్ ను ఈ నెల 20వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా ఓ పోస్టర్ రిలీజ్ చేసారు. ‘కళావతి’తో క్లాస్ మెప్పించిన థమన్, ఈ ‘పెన్నీ’తో మాస్ ను ఊపేస్తారేమో చూడాలి.
వరుస విజయాలతో ప్రస్తుతం ‘టాక్ ఆఫ్ టాలీవుడ్’గా మారిన థమన్ నుండి వస్తోన్న ఆల్బమ్ కావడంతో, “సర్కార్ వారి పాట” సాంగ్స్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఫ్యాన్స్ కు కావాల్సిన మాస్ కిక్ ను పంచే విధంగా ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించినవన్నీ సోషల్ మీడియాలో ముందుగానే లీక్ అవుతుండడం, అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది.
The teaser for Sunny Deol’s next, Suryaa, is out now. The movie was announced a…
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has defended the direct election of mayors and…