
బ్యారక్ లోని టాయిలెట్లో రోజుకు గంట పాటు మాత్రమే నీరు వస్తుంది. తెల్లవారుజామున టాయిలెట్ అలవాటు లేకుంటే, ఆపై వాటిని వాడటం అంత సులువు కాదు. దానికి రోజంతా అవి కంపు కొడుతూనే ఉంటాయి. ఇక ఉదయం లేచిన తరువాత మిగతా వారితో సమానంగా రోజంతా తనకు అప్పగించిన పనిని ఆమె చేయాల్సి వుంటుంది. జైలు నుంచే పార్టీ కార్యకలాపాలు చక్కబెట్టాలన్న ఆమె వ్యూహానికి ఈ నిబంధన అడ్డంకిగా నిలవవచ్చని తెలుస్తోంది. శశి ప్రత్యేక ఖైదీ కాదు కాబట్టి, ఆమెను స్పెషల్ గా చూస్తే, ఆ వార్త వెంటనే బయటకు పొక్కిపోతుంది.
ములాఖత్ లు కూడా ఎక్కువగా ఉండవు గనుక అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, నేతలు ఎవరు వచ్చినా పరిమితంగానే రావాల్సి వుంటుంది. ఇక ఈ జైలుకు గత మూడేళ్ల నుంచి సున్నం కూడా వేయలేదు. పెద్ద పెద్ద గోడలున్న ఓ మురికివాడలా జైలు లోపలి పరిస్థితులు ఉంటాయని, తొలిసారి దీన్ని చూస్తే, భయపడాల్సిందేనని ఇక్కడికి వెళ్లి వచ్చిన వారు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఆమెకు స్పెషల్ క్లాస్ ఖైదీ హోదా వచ్చేలా చూడటం, లేకుంటే, తమిళనాడులోని ఏదైనా జైలుకు తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేయాలని అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు.
Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam has collected approximately Rs. 36 crores gross worldwide in its first two…
పులివెందులలో జరిగిన అల్లర్లు, పోలింగ్ సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, వైసీపీ అధినేత జగన్మోహన్…