
ఈ ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అడిగిన ప్రశ్నలకు తానూ చూసిన పవన్ గురించి చెప్పుకొచ్చారు. “పవన్ కల్యాణ్ ఆలోచనలు చాలా జెన్యూన్ గా ఉంటాయి. ఎక్కడా డీవియేషన్స్ ఉండవు. ముక్కుసూటిగా మాట్లాడతారు. నేను శిక్షణ ఇచ్చే సమయంలో క్లాసులో పవన్ చేసిన నటన ఆయనకు నచ్చకపోతే కనుక, మరోసారి చేస్తానని చెప్పేవాడు. అంటే, కాంప్రమైజ్ అయి ముందుకు వెళ్లిపోదామనే నేచర్ మొదటి నుంచి లేదు” అంటూ పవన్ వ్యక్తిత్వం గురించి చెప్పుకొచ్చారు.
అలాగే పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న ‘ఫోక్’ సాంగ్ ల వెనుక ప్రభావం సత్యానంద్ అని అంటారు… దీనిపై మీ సమాధానం అని యాంకర్ అడగగా… వంగపండు గారు రచించిన ‘సీతన్న’ పాత్ర పోషించేటప్పుడు ‘ఫోక్’ సాంగ్ లు ఉంటాయి, అవి పవన్ కు ఎక్కువగా నచ్చడం, అవి విని హుషారు తెచ్చుకోవడం జరిగేదని, పవన్ కు ఎక్కువగా మొహమాటం, బిడియం, సిగ్గు ఎక్కువ… వాటిని బ్రేక్ చేయడానికి నేను ప్రయోగించిన వాటిలో ఫోక్ సాంగ్ ఒకటని, అది చాలా వర్కౌట్ అయ్యిందని, అయితే ఇప్పటికీ దానిని వదలకుండా సినిమాలో ఏదొక టైం లో చిన్న హమ్మింగ్ అయినా చేస్తూ ఉంటాడని… పవన్ ‘ఫోక్’ సాంగ్ ల అసలు కధను వివరించారు సత్యానంద్.
Director Sandeep Reddy Vanga had been tasting phenomenal success right from the early stages of…
Small films are releasing in large numbers in Tollywood, but very few are making a…