Telugu

సవ్యసాచి – ఫస్టాఫ్ ఎంటర్టైన్మెంట్… సెకండాఫ్ సీరియస్..!

నవంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “సవ్యసాచి” సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో చిత్ర యూనిట్ ఉంది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అస్సలు ప్రసంగించని దర్శకుడు చందు మొండేటి సినిమాపై వస్తోన్న ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘హలోబ్రదర్’ సినిమాతో ‘సవ్యసాచి’కి పోలికలు ఉన్నాయన్న అంశాన్ని ఖండించారు.

[m9ad]

ADVERTISEMENT

ఇది పూర్తిగా కొత్త కధ అని, గతంలో తాను చదివిన ఓ ఆర్టికల్ ను ప్రామాణికంగా చేసుకుని ఈ కధను తయారు చేసుకున్నానని చందు స్పష్టం చేసారు. ఆ కధను వినే చైతూ, మైత్రీ మూవీ మేకర్స్, మాధవన్ గార్లు ఒప్పుకున్నారని, “సవ్యసాచి” అన్న టైటిల్ ముందుగానే అనుకున్నామని, కధకు అదే సరైనదిగా భావించామని తెలిపారు. సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది టెన్షన్ పెరుగుతోన్న మాట వాస్తవమేనని, ప్రేక్షకుల స్పందన కోసం అంతా వేచిచూస్తున్నామని అన్నారు.

ఇక నాగార్జున సూపర్ హిట్ సాంగ్ ‘నిన్ను రోడ్డు మీద చూసినది’ అన్న పాట రీమిక్స్ పూర్తిగా తన ప్లాన్ అని, ఫస్టాఫ్ అంతా ఎంటర్టైనింగ్ గా సాగిపోతుందని, దీంతో సీరియస్ గా సాగే సెకండాఫ్ లో ప్రేక్షకులకు కాస్త రిలాక్సేషన్ కోసం ఈ రీమిక్స్ సాంగ్ ను తానే ప్లాన్ చేసానని చందు చెప్పుకొచ్చారు. ప్లానింగ్ బాగానే ఉంది గానీ, ఆ పాట సరిగా రాకపోవడం అభిమానులకు కూడా రుచించని అంశంగా మారింది. బహుశా సిల్వర్ స్క్రీన్ పై ఏమైనా పండుతుందేమో చూడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

King 100 OTT: One Worry Off Nagarjuna’s Shoulders?

Nagarjuna’s much-awaited 100th film, King100, has reportedly locked its digital streaming deal with SonyLIV. The…

1 hour ago

ప్రజలు, ప్రత్యర్ధులను భయపెట్టి అధికారంలోకి.. సాధ్యమేనా?

గతంలో ప్రభుత్వాలు, పోలీసులు మావోయిస్టులను అడవులు, తుపాకులు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చేవారు. ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు…

1 hour ago