శారదా పీఠాధిపతికి భద్రత…అవసరమా?

వడ్డించేవాడు మనోడైతే చివర కూర్చున్నా విస్తరిలో అన్నీ వచ్చి పడతాయన్నట్లు జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు 900 మంది కమెండోలతో భద్రతతో కల్పించుకున్నారు.

జగన్‌ ముఖ్యమంత్రి పైగా ప్రాణ భయం ఎక్కువ. కనుకనే తాడేపల్లి ప్యాలస్‌ నుంచి ఎప్పుడు ప్రజల మద్యకు వచ్చినా దారి పొడవునా పరదాలు కట్టించుకొని, పచ్చటి చెట్లు నరికించేసేవారని సర్దిచెప్పుకోవచ్చు.

ADVERTISEMENT

కానీ విశాఖలో పెందుర్తి వద్ద శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రకు, ఆయన ఉత్తరాధికారి స్వాత్మానందేంద్రకు కూడా జగన్‌ ప్రభుత్వం భద్రత కల్పించడం విశేషం. వారిరువురికీ వేర్వేరుగా నలుగురు గన్‌మాన్, ఐదుగురు ఏఆర్ గార్డులు, నలుగురు కానిస్టేబుల్స్, ఇద్దరు డ్రైవర్లు, రెండు ఎస్కార్ట్ వాహనాలను జగన్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.వీరు కాక అనధికారికంగా మరో ఏడుగురు సిబ్బందిని కూడా జగన్‌ ప్రభుత్వం వారికి కేటాయించింది.

ఈ విషయం టిడిపి కూటమి ప్రభుత్వం దృష్టికి వెళ్ళడంతో తక్షణమే వారికి కల్పించిన ఈ భద్రతని తొలగించాలని ఆదేశించింది. అప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. స్వరూపానందేంద్రకు మాత్రం ఇద్దరు కానిస్టేబుల్స్‌తో రక్షణ కల్పించాలని ఆదేశించింది.

తిరుమల మొదలు శ్రీకాకుళం వరకు రాష్ట్రంలో అనేక పీఠాలు, పీఠాధిపతులు ఉన్నారు. కానీ వారందరికీ జగన్‌ ప్రభుత్వం ఎటువంటి భద్రత కల్పించలేదు. కానీ ఒక్క శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర మాత్రమే కల్పించింది. ఎందువల్ల అంటే ఆయన కేసీఆర్‌, జగన్‌కి మద్యవర్తిగా వ్యవహరించేవారు.

జగన్‌కు ప్రాణభయం ఉంటే ఉండవచ్చు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్న స్వరూపానందేంద్రకి శత్రువులు ఎవరు ఉంటారు?ఆయనకు కూడా ప్రాణ భయం ఉందా? లేకపోయినా జగన్‌ ప్రభుత్వం కల్పించిన భద్రతను ఎందుకు స్వీకరించారు?అంటే అటువంటి భద్రత కలిగి ఉండటం గొప్పగా ఉంటుందనేమో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Deepika-Ranveer Welcome Second Baby: Fans Wanted More?

Deepika Padukone and Ranveer Singh have reportedly welcomed their second child, a baby girl. Their…

19 minutes ago

If Lust Stories 3 Is Bold, Then Why Was Peddi Attacked?

Ram Charan fans are once again bringing Peddi into the discussion around Lust Stories 3.…

19 minutes ago