
మూడు పెళ్లిళ్లు, నలుగురు భార్యలు అంటూ గత పదేళ్లుగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మొదలుకుని ఆ పార్టీ సాధారణ కార్యకర్త వరకు అందరు ఏకకంఠంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద బహిరంగ విమర్శలు ఎన్నో చేసేసారు. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు కూడా.
అయినా కూడా వారిలో కాసంతైనా కూడా పచ్చాత్తాపం కనిపించకపోవడం విస్మయానికి గురి చేస్తుంది. ఇన్నాళ్లుగా తమ పార్టీలోని నేతలందరూ ఏకసంతాగ్రాహిలుగా, శ్రీరామా చంద్రుని బాటలో నడిచిన నాయకుల మాదిరి కలరింగ్ ఇచ్చినప్పటికీ గత కొద్దీ కాలంగా వైసీపీ నేతల భాగోతాలు, అక్రమ సంబంధాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నప్పటికీ ఇంకా వైసీపీ నేతలు పవన్ వ్యక్తిగత జీవితం మీద విమర్శలు చేస్తూ శుద్ధ ప్రవచనాలు వల్లించడం వినడానికి, చూడడానికి కూడా జుగుప్స ను కలిగిస్తున్నాయి.
తాజాగా సనాతన ధర్మం మీద ప్రవచనాలు చెప్పడానికి ఆసక్తి చూపిస్తున్న వైసీపీ నేతలు పవన్ వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ కోవలోకి వచ్చేసారు మాజీ మంత్రి వైసీపీ నేత సిదిరి అప్పలరాజు. భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరొకరితో కలిసి ఉండమని ఏ సనాతన ధర్మంలో చెప్పబడింది.? చేగువేరా ఆదర్శాలు ఎటు పోయాయి.? భార్య క్రిస్టియన్, భర్త హిందువు, పిల్లలు ఆర్దోడాక్స్ క్రిస్టియన్స్ ఇవన్నీ ఏ సనాతన ధర్మంలో దాగున్నాయి.? అంటూ పవన్ కు కౌంటర్ వేశారు సిదిరి.
అయితే సిదిరి అప్పలరాజు ఇప్పుడు ప్రజలకు చెప్పాల్సింది పవన్ కు మూడు పెళ్లిళ్లు అయ్యాయా.? పవన్ పిల్లలు హిందువులా.? క్రిస్టియన్సా.? అన్నది కాదు వెంకన్న లడ్డు ప్రసాదంలో కల్తీ కలిసిందా.? లేదా అని. ఇవన్నీ తెలిసే కదా ప్రజలు పవన్ కు మద్దతుగా నిలిచింది. ఇవేమి వైసీపీ నేతలు పవన్ విషయంలో కొత్తగా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజల ముందుకు తీసుకురాలేదు.
పవన్ భార్య క్రిస్టియన్ అని ప్రజలకు తెలుసు, ఆయన వ్యక్తిగత జీవితం గురించి మొత్తం పవన్ కళ్యాణ్ నే పలుమార్లు బహిరంగ వేదికల మీద వివరించారు. ఆయన వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకమే కాబట్టి ఈ విమర్శల వలన వైసీపీ కి ప్రజలలో వచ్చే మైలేజ్ ఏమి ఉండక పోగా విషయాన్ని వైసీపీ పక్క దారి పట్టిస్తున్నట్లు గా ప్రజలు భావించే అవకాశం లేకపోలేదు.సిదిరి అప్పలరాజుకి కౌంటర్ వెయ్యడం జనసేనకు రెండు సెకన్ల పని.
వైసీపీ పార్టీలో విజయసాయి రెడ్డి వ్యవహారం నుండి ఇంకా ఒక ముగింపు పలకని దువ్వాడ వివాదం వరకు అన్ని సోషల్ మీడియాలో ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నాయి. వాటిలో ఏ ఒక్క విషయంలో కూడా ప్రజలడిగే ప్రశ్నలకు వైసీపీ దగ్గర సమాధానం లేదు. అలాంటప్పుడు ఇలాంటి నీతి ప్రవచనాలు చెప్పడం అంటే గిల్లి గిల్లించుకోవడమే అవుతుంది మాజీ మంత్రిగారు.
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set for a…
Vijay’s rise to power in Tamil Nadu has once again brought the spotlight on actors…