
ఇవాళ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి పెట్టిన ప్రెస్ మీట్ లో.. ఎగ్జిబిటర్ల డిమాండ్ల గురించి రెస్పాండ్ అవుతూనే, ఓ ప్రముఖ ఎగ్జిబిటర్ మీద వరుస పంచులు వేశారు.
నాగవంశీ ఏకంగా.. నిన్నటి మీటింగ్లో ఆయన కూర్చోవడం, సింగిల్ స్క్రీన్స్ అంతరించిపోతున్నాయి అంటూ బాధపడిపోవడం హాస్యాస్పదం అంటూ కామెంట్ చేయడం అనేది హైలైట్ గా మారింది.
ఇక మైత్రి రవి అయితే.. ఎక్కడపడితే అక్కడ మల్టీప్లెక్సులు కట్టేస్తున్న ఆ సేట్ జీ.. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ కాపాడండి అనడం పెద్ద జోక్ అంటూ ఎద్దేవా చేయడం గమనార్హం.
ఇలా నాగవంశీ, మైత్రి రవి మీడియా ముఖంగా సెటైర్లు వేసిన ఆ సేట్ జీ ఎవరు అనేది అందరికీ తెలిసిందే. కాకపోతే.. డైరెక్ట్ గా పేరు చెప్పడం లేదు అంతే.
ఈ ప్రెస్ మీట్ తో ఎగ్జిబిటర్స్ వర్సెస్ మైత్రి కాస్త.. ప్రొడ్యూసర్స్ వర్సెస్ సేట్ జీ గా మారిపోయింది. మరి ఆ ప్రముఖ సేట్ జీ కూడా సైలెంట్ గా ఉండే రకం కాదు. ఆయన ఎలాంటి కౌంటర్ ఇస్తాడో చూడాలి.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…