జగనన్నని వదల బొమ్మాళీ… వదల!

ఎన్నికలలో ఘోర పరాజయంతో ప్రజలకు మొహం చూపించలేకపోతున్న జగన్మోహన్‌ రెడ్డికి మరో కొత్త సమస్య వచ్చింది. అది కూడా మళ్ళీ చెల్లి వైఎస్ షర్మిల నుంచే!

ఎన్నికలలో ఆమె ఏపీ కాంగ్రెస్‌ను గెలిపించుకోలేకపోయినా, తనకు అన్యాయం చేసిన జగనన్నని ఓడించి గద్దె దించడంలో కీలకపాత్ర పోషించారు. అయితే అక్కడితో కధ ముగిసిపోలేదంటున్నారు షర్మిల.

ADVERTISEMENT

వైసీపిని పూర్తిగా తుడిచిపెట్టేసే వరకు నిద్రపోనని శపధం చేసిన్నట్లున్నారు. అందుకు ఆమె ఎంచుకున్న మార్గం తండ్రి వైఎస్‌ ఇమేజ్‌ని అన్న నుంచి లాక్కోవడమే!

తండ్రి పేరుతోనే జగన్‌ ఓదార్పు యాత్రలు చేసి ప్రజలకు దగ్గరయ్యారు. తండ్రి పేరు చెప్పుకునే జగన్‌ ఏపీలో కాంగ్రెస్‌ నేతలను, బలమైన కాంగ్రెస్‌ క్యాడర్‌ని వైసీపిలోకి ఆకర్షించి బలోపేతం చేసుకున్నారు. అధికారంలోకి వచ్చే వరకు తండ్రి పేరుని జగన్‌ నిత్యం రామనామ స్మరణ అంత భక్తిగా చేసేవారు. చివరికి అదే ఆయనను అధికారంలోకి తెచ్చింది కూడా.

కానీ అధికారంలోకి వచ్చాక తండ్రికి బదులు చంద్రబాబు నాయుడు నామ స్మరణ ఎక్కువగా చేస్తూ హిరణ్యకశిపుడులా ఆయన చేతిలోనే రాజకీయంగా అంతం అయ్యారు! ఇది వేరే కధ!

జగన్‌ ఇప్పుడు అధికారం కోల్పోయారు కనుక మళ్ళీ తండ్రి పేరు జపించకమానరు. ఈవిషయం అందరికంటే ముందు షర్మిల పసిగట్టారు. అందుకే ఆమె చకచకా పావులు కదిపి జూలై 8న విజయవాడలో అట్టహాసంగా వైఎస్ 75వ జయంతిని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

చనిపోయిన తండ్రిపై ఆమెకు ప్రేమాభిమానాలు ఉంటే ఆ విషయం చాటింపు వేసుకోనవసరం లేదు. కానీ కాయలు అమ్ముకోవాలంటే చెట్టు పేరు చెప్పుకోక తప్పదన్నట్లు, ఏపీలో కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకోవాలంటే ‘వైఎస్ ఇమేజ్‌’ కూడా చాలా అవసరం.

కనుక వైఎస్‌ ఇమేజ్‌ కాంగ్రెస్ పార్టీకి ‘మాత్రమే’ సొంతం అని నిరూపించేందుకు హడావుడి చేస్తున్నట్లు భావించవచ్చు. అందుకే ఇంతకాలం ‘వైఎస్’ని పట్టించుకోని కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఆమె ప్రయత్నాలకు మద్దతు ఇస్తోందని భావించవచ్చు.

జగన్‌ కూడా తండ్రి పేరుతోనే రాజకీయాలు చేసి పైకొచ్చారు కనుక చెల్లి హడావుడి దేనికో బాగా తెలుసు. ఇది ఆయనకు మరో కొత్త తలనొప్పే అని చెప్పక తప్పదు.

కనుక జగన్‌ కూడా చనిపోయిన తండ్రిని కాపాడుకునేందుకు ప్రయత్నించక తప్పదు. జగన్‌ కూడా వైఎస్ జయంతి పోటీలలో పాల్గొనక తప్పదు. కనుక వైసీపి కూడా జూలై 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

అన్న విజయవంతంగా అమలు చేసిన ఫార్ములాని షర్మిల అన్నపైనే ప్రయోగించి వైసీపిని కాంగ్రెస్‌లో కలిపేసుకొని రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారు. కనుక చెల్లి నుంచి వైసీపిని కాపాడుకోవడానికి జగన్‌ కూడా ప్రయత్నాలు చేయక తప్పదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

జగన్, విజయ్ ని ఫాలో అవుతున్నారా.?

తమిళనాడు ఎన్నికల ఫలితాల విడుదల తరువాత ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ రాజకీయం రంగు మార్చుకుంటుంది. నిన్న మొన్నటి వరకు ఐప్యాక్…

8 minutes ago

Pati Patni Aur Woh Do: Fake and Paid Reviews Stand Exposed?

The Ayushmann Khurrana starrer Pati Patni Aur Woh Do has finally hit theaters today, but…

10 minutes ago