
అన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల రెట్టించిన ఉత్సాహంతో తిరిగి కాంగ్రెస్ పార్టీని ప్రజలలోకి తీసుకువచ్చింది. వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, జగన్ పాలనను ప్రజలలో ఎండగడుతూ, రచ్చబండ, బహిరంగ సభలు అంటూ నిత్యం ప్రజల మధ్యే గడుపుతున్నారు షర్మిల. ఇన్నాళ్ళుగా బీజేపీ తో జరుగుతున్న ట్రై యాంగిల్ లవ్ స్టోరీలో జగన్ పాత్రను, వైసీపీ మద్దతుని వెలుగులోకి తెచ్చారు షర్మిల.
అయితే గత ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు మద్యం దుకాణాలలోనే అమలవుతున్నాయి అంటూ జగన్ ప్రభుత్వానికి సెటైరికల్ కౌంటర్ వేశారు షర్మిల. 2019 ఎన్నికల ప్రచారంలో నేను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను అంటూ హామీ ఇచ్చాడు జగన్ రెడ్డి. అలాగే 25 కి 25 మంది ఎంపీలను మా పార్టీకి ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తాను అన్నాడు.
అలాగే జాబ్ క్యాలెండరు విడుదల చేస్తానన్నాడు, అయితే గడిచిన నాలుగున్నరేళ్లుగా ఇవన్నీ మరిచిపోయిన జగన్ ఇప్పుడు ఎన్నికలకు రెండు నెలల ముందు వచ్చి మెగా డిఎస్సి అంటూ అందరిని దగా చేయడానికి సిద్ధమయ్యారు అంటూ పాడేరు బహిరంగ సభలో షర్మిల వైసీపీ ప్రభుత్వం పై విరుచుగుకుపడ్డారు. కేంద్రం మెడలు వంచుతాను అన్న ఈయన గారు కేంద్ర పెద్దలకు సాష్టాంగ ప్రణామాలు చేస్తూ కల్తీ మద్యంతో మందు బాబుల నడ్డి విరుస్తున్నారు.
అయితే జగన్ ఇచ్చిన హామీలన్నీ కూడా రాష్ట్రంలో ఒక్కచోట మాత్రం అమలవుతున్నాయి, అవి మందుబాబులకు అందుబాటులో ఉన్నాయంటూ జగన్ సర్కార్ మద్యం దుకాణాల గురించి వివరించారు. సర్కారే మద్యం అమ్ముతుంది, వారెంతకు అమ్మితే అంతకే కొనాలి, అలాగే వారేఅమ్మితే అదే కొనాలి.
వాళ్ళు బూమ్ బూమ్ అమ్మితే బూమ్ బూమ్ కొనాలి, స్పెషల్ స్టేటస్ అమ్మితే స్పెషల్ స్టేటస్ కొనాలి, మెగా డీఎస్సి అమ్మితే దాన్నే కొనాలి. ఎక్కడయ్యా నీ ఎన్నికల హామీలు జగన్ రెడ్డి అంటే అన్ని మద్యం షాపులలో ఉన్నాయి అనేలా ఈ ప్రభుత్వ పాలన ఉంది అన్నారు.
ఇదేనా రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వాన్ని నిలబెట్టడం అంటే అంటూ జగన్ ఎన్నికల హామీల అమలు పై సెటైర్లు వేశారు షర్మిల. మానిఫెస్టోనే ఒక బైబిల్, కురాన్, భగవత్ గీత అంటూ నీతులు చెపుతూ ఇలా ఇచ్చిన హామీలన్నీ మద్యం బాటిల్స్ కి పేర్లుగా పెట్టి మందు బాబులకు అమ్ముకుంటున్నారు అంటూ జగన్ సర్కార్ పై ఈ రోజు కూడా ఎక్కడా తగ్గేదెలా అనుకుంటూ అదే స్థాయిలో విమర్శలు గుప్పించారు షర్మిల.
Rajinikanth is going to return to the big screen tomorrow with his new film Jailer…
స్థానిక సంస్థల ఎన్నికలలో సీట్ల సర్దుబాట్ల విషయంలో సోషల్ మీడియాలో ఇరు వర్గాల మద్దతుదారులు చేస్తున్న వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా…