
ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాజకీయాలలో వైస్ జగన్ మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బిఆర్ఎస్ పార్టీకి ఇంటి ఆడపడుచుల పోరు తగులుకుంది. ఈ నేపథ్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా షర్మిల కూడా వైస్ షర్మిలగానే రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులయ్యారు.
అలాగే కవిత కూడా తన తండ్రి ఇంటి పేరు కల్వకుంట్ల తోనే తెలంగాణ రాజకీయాలలోకి అడుగుపెట్టారు. అయితే నాడు ఈ చెల్లెళ్ళ ఇంటి పేరు పై అభ్యంతరాలు లేవనెత్తని వైసీపీ, బిఆర్ఎస్ నేడు మాత్రం షర్మిలను ఎస్ షర్మిల కాదు మురుసుపల్లి షర్మిల అంటూ, కవిత ను కల్వకుంట్ల కవిత కాదు దేవనపల్లి కవిత అంటూ ఆయా పార్టీల సోషల్ మీడియాలు ట్రోల్ చేస్తున్నాయి.
అయితే నిన్న మొన్నటి వరకు వైఎస్ షర్మిల, కల్వకుంట్ల కవిత అంటే జై జై లు కొట్టిన వైసీపీ, బిఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు వారి ఆడపడుచుల ఇంటి పేర్ల పై అభ్యంతరాలు లేవనెత్తడం ఎంతవరకు సబబు.? అన్న వదిలిన బాణం అంటూ వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేసినప్పుడు వైఎస్ షర్మిల గానే షర్మిల వైసీపీ కి అనుకూలంగా రాజకీయ ప్రచారం చేసారు.
అలాగే కేసీఆర్ తెరాస నుంచి బిఆర్ఎస్ వరకు కవిత రాజకీయ ప్రస్థానం మొత్తం కల్వకుంట్ల కవితగానే సాగింది. బిఆర్ఎస్ ఎంపీ గా, ఎమ్మెల్సీ గా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో దోషిగా ఇన్ని పాత్రలలోను కవిత కల్వకుంట్ల కవితగానే తన రాజకీయ ప్రయాణాన్ని సాగించారు.
నాడు వైఎస్ షర్మిలగా షర్మిలను ఆదరించిన వైసీపీ, కల్వకుంట్ల కవిత గా కవితకు రాజకీయ అవకాశం ఇచ్చిన బిఆర్ఎస్ నేడు అదే వైఎస్ పేరును, అదే కల్వకుంట్లను ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు. వైసీపీ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరినంత మాత్రాన షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి రక్తం కాకుండా పోతారా.? ఆమెకు ఎదుగురి సందింటి పేరుతో బంధం లేకుండా అవుతుందా.?
బిఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెన్షన్ వేటుతో బయటకు వచ్చి కొత్త రాజకీయ పార్టీ స్థాపించినంత మాత్రాన కవిత కేసీఆర్ కుమార్తె కాకుండా అవుతారా.? ఆడపిల్లకు తన ఇంటి పేరు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉన్న AI యుగంలో ఇంకా వైసీపీ, బిఆర్ఎస్ లు నీకు తండ్రి ఇంటి పేరు మీద హక్కు లేదంటూ వాదిస్తూ అదేదో కవిత, షర్మిల చేసిన, చేస్తున్న పెద్ద రాజకీయ ద్రోహం అన్నట్టుగా ప్రచారం చేస్తుంటే దానికి ప్రజామోదం లభిస్తుందా.?
Following the commercial success of Psycho in 2020, director Mysskin completed the shooting for his…
Drishyam: The Conclusion has been a big box-office success. Trade experts can't predict exactly where…