
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలి హోదాలో వైస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసురాలిగా ఏపీ ఎన్నికల బరిలోకి దిగిన షర్మిల ఆ పార్టీ తరుపున ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ కి కర్త, కర్మ, క్రియ తానే అన్నట్టుగా పార్టీ కార్యకర్త నుంచి పార్టీ నాయకురాలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా తానే అయ్యి కాంగ్రెస్ జెండా పట్టుకుంటున్నారు.
2024 ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నాయకులు రఘువీరా రెడ్డి, శైలజానాథ్ లు కూడా షర్మిలకు తోడుగా అడుగులు కలిపారు. అలాగే వైసీపీ మాజీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి సైతం నేను అంటూ షర్మిల వెంట నడిచేందుకు అన్న జగన్ కు బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు.
కానీ ఆ చేరిక పాల మీద పొంగు మాదిరి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. ఇక శైలజానాథ్ సైతం షర్మిలకు బై చెప్పి జగన్ కి జై కొట్టారు. అలాగే రఘువీర రెడ్డి కూడా ఎన్నికల ఫలితాలకు ముందు నుంచే పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఇలా షర్మిల ఏపీలో కాంగ్రెస్ పార్టీలో నాటి నుంచి నేటి వరకు ఒంటరి ప్రయాణం చేస్తున్నారు.
అయితే ఆ ఒంటరి ప్రయాణానికి తోడుగా నిలిచేందుకు ఏపీలో రాజకీయంగా ముందుకెళ్లేందుకు పొలిటికల్ గా మునిగిపోయిన కాంగ్రెస్ నావలోకి ప్రవేశించేందుకు ఏ ఒక్కరు రాజకీయ నాయకుడు కూడా ఆసక్తి చూపడం లేదు. ఒకానొక సందర్భంలో షర్మిల కుమారుడు రాజారెడ్డి అమ్మకు తోడుగా పార్టీ కార్యక్రమాలలో మెరిశారు.
దీనితో త్వరలో షర్మిల రాజకీయ వారసుడిగా తనయుడు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ అంటూ మీడియాలో వార్తలు చెక్కర్లు కొట్టాయి. అందుకు అనుగుణంగానే షర్మిల్ కూడా అవసరమైన సమయంలో రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడు అంటూ ప్రకటించారు.
అయితే ఇప్పటికే ఏపీలో టీడీపీ vs వైసీపీ గా సాగుతున్న రాజకీయ పోరులోకి మూడో ప్రత్యామ్నాయంగా జనసేన వచ్చి చేరింది. ఇక కూటమి పొత్తులో భాగంగా బీజేపీ కూడా పొలిటికల్ గా యాక్టీవ్ గా ఉంది. ఈ సందర్భంలో రాజకీయంగా ఏపీలో ఇక మరోపార్టీ ఉనికి కి కూడా స్థానం లేకుండా పోయింది.
అయినా కాంగ్రెస్ అధిష్టానం కూడా స్థానికంగా పార్టీ బలోపేతానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అలాగే పార్టీలో యువరక్తాన్ని ప్రోత్సహించే దిశగా ఎటువంటి ప్రణాళికలు చేపట్టడం లేదు. పేరుకు మాత్రమే పార్టీ అన్నట్టుగా కాంగ్రెస్ అధినాయకత్వం సైతం ఏపీలో కాంగ్రెస్ ని గాలికొదిలేసింది.
ఇటువంటి పరిస్థితులలో షర్మిల తన ఒంటరి ప్రయాణంతో రాజకీయంగా కాంగ్రెస్ కి ఊపిరి పొయ్యగలదా.? ఇతర పార్టీల మాదిరి ప్రజా సమస్యల పై పోరాటం చేసి ప్రజా మద్దతు కూడగట్టగలదా.?
Rakul Preet Singh has broken her silence over reports linking her to an Income Tax…
India and West Indies will begin their five match T20I series on Tuesday, October 6,…