Telugu

మావిగన్ తో మొదలైన రచ్చ అవిగొడ్డలితో ముగిసిందా.?

ఈ నెల 2 వ తేదీన పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అంటూ చట్టం చేయబడింది. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ముఖ్యంగా అమరావతి రైతు కుటుంబాలు సంతోషంతో సంబరాలు జరుపుకున్నారు.

‘

ADVERTISEMENT

అయితే అమరావతి పై నిత్యం విషం చిమ్మే వైసీపీ మాత్రం పార్లమెంట్ ఉభయసభలలో అమరావతి బిల్లును ఎలానూ అడ్డుకోలేకపోయాం కనీసం వారి సంబరాలనైనా అడ్డుకుందాం అనుకుందో ఏమో కానీ మరోకొత్త వాదనతో మీడియా ముందుకొచ్చింది.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి రాష్ట్ర రాజధానిగా రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్న అమరావతి కాదని, పార్లమెంట్ ఉభయసభలలో ఒక్క వైసీపీ మినహాయించి దేశంలోని ఇతర పార్టీల నేతలందరూ ఆమోదించిన అమరావతి బిల్లును వద్దని, గతంలో తానూ ప్రకటించిన మూడు రాజధానుల కాన్సెప్ట్ ని పక్కన పెట్టి మరి మచిలీపట్టణం, విజయవాడ, గుంటూరు అంటూ మూడు ప్రాంతాల పేర్లను కలుపుతూ మావిగన్ తో ముందుకొచ్చారు.

అయితే రాష్ట్ర రాజధాని అమరావతికి వ్యతిరేకంగా జగన్ సృష్టించిన మావిగన్ తో జగన్ తో సహా ఆ ప్రతిపాదనను సమర్ధించిన నేతలందరూ సోషల్ మీడియాకు మంచి ఆహారమయ్యారు. అయినా కూడా వైసీపీ ఎక్కడ తగ్గేదెలా అన్నట్టుగా మావిగన్ పోస్టర్లతో, ఫ్లెక్సీ లతో రెచ్చిపోయారు.

విషానికి విషమే విరుగుడు అన్న చందంగా వైస్ జగన్ మావిగన్ ప్రకటనకు ఆయన సోదరి షర్మిల చేసిన అవిగొడ్డలి విరుగుడుగా మారింది. జగన్ అమరావతికి బదులు మావిగన్ అంటూ ప్రతిపాదిస్తే, షర్మిల మీడియా పులివెందుల పేరును అవినాష్ నుంచి అవి తీసుకుని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న గొడ్డలి వేటు నుంచి గొడ్డలి ని తీసుకుని అవిగొడ్డలిగా మార్చాలంటూ కోరారు.

దీనితో వైసీపీ శ్రేణులందరు ఒక్కసారి మావిగన్ ను పక్కన పెట్టి షర్మిల మీద విరుచుకుపడేందుకు మీడియా ముందుకు క్యూ కట్టారు. వైసీపీ మావిగన్ పేరెత్తితే ప్రజలకు షర్మిల ప్రకటించిన అవిగొడ్డలి యాదికొస్తుందనే భయమే వైసీపీ ని మావిగన్ నుంచి బయటకు తెచ్చిందా.?

లేదా వైసీపీ అదే మావిగన్ రాగంతో ముందుకెళితే వైసీపీ కి ప్రియమైన గన్నులు, గొడ్డళ్లు ఇంకా కొన్ని మీడియా ముందుకొస్తాయనే భయమే వైసీపీ నోరుకట్టేస్తుందా.? ఏదిఏమైనా మావిగన్ తో మొదలైన రచ్చ అవిగొడ్డలితో ముగిసినట్టయ్యింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jailer 2: Rajini Fans Fear Another Coolie After Trailer?

Ever since the most anticipated trailer of Rajinikanth's Jailer 2 directed by Nelson Dilipkumar, was…

23 minutes ago

CBN, Pawan Discuss Seats Ahead of Local Body Polls

AP Chief Minister N. Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan held a key…

42 minutes ago