బైకర్: పట్టించుకోని ఆడియన్స్, ఫుల్ జోష్ లో శర్వా!

Sharwanand promoting Biker movie with energetic expressions during theatre visit

గతవారం విడుదలైన “బైకర్”ని శర్వానంద్ ప్రమోట్ చేసినట్లుగా, తన మునుపటి సినిమాలేవీ చేయలేదు. మరీ ముఖ్యంగా శర్వానంద్ రిలీజ్ కి ముందే “బైకర్” ను తన బెస్ట్ ఫిలింగా డిక్లేర్ చేయడం అనేది హాట్ టాపిక్ గా మారింది.

అయితే.. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని థియేటర్లకి వెళ్లిన శర్వానంద్ అక్కడ ఏకంగా వెండితెరకి సాష్ఠంగా నమస్కారం చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది. విడుదలైన రోజే సక్సెస్ మీట్ తో హిట్ అయ్యిందని చెప్పొచ్చిన టీమ్, ఇప్పుడు థియేటర్ విజిట్ లతో కాస్త జోరు పెంచారు.

ADVERTISEMENT

అయితే.. బైకర్ టీమ్ సంతోషానికి, సినిమా కలెక్షన్స్ కి పొంతన కుదరడం లేదు. ముఖ్యంగా అమెరికాలో మొదటివారంలో కనీసం 150K డాలర్ల మార్క్ కూడా దాటలేదు.

వరల్డ్ వైడ్ లెక్కలు చూసుకున్నా 10 కోట్ల గ్రాస్ తో సరిపెట్టుకుంది బైకర్. అది కూడా తెలుగు, తమిళం కలుపుకొని. సినిమా హిట్ అనిపించుకోవాలంటే 40 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయడం అవసరం. గత శుక్రవారం గుడ్ ఫ్రైడే హాలిడేతో లాంగ్ వీకెండ్ ని ఏమాత్రం యూటిలైజ్ చేసుకోలేకపోయింది బైకర్.

ఇక ఈవారం “డెకాయిట్, LIK, పళ్లిచట్టంబి” వంటి సినిమాలు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. మరి ఈ పోటీ మధ్యలో బైకర్ నిలబడి, సినిమాకి కావాల్సిన మిగతా 30 కోట్ల గ్రాస్ ని వసూలు చేయగలుగుతుందా అనేది పెద్ద ప్రశ్న.

అయితే.. ఇదంతా పట్టించుకోకుండా శర్వానంద్ మాత్రం ఫుల్ జోష్ లో దూసుకుపోతుండడం అనేది గమనార్హం. “నారీ నారీ నడుమ మురారి”కి హిట్ టాక్ వచ్చి, కలెక్షన్స్ పర్లేదు అనుకునే తరుణంలో ఓటీటీ రిలీజ్ చేసి దెబ్బతిన్నాడు శర్వా, ఇప్పుడు “బైకర్” ఏమో కలెక్షన్స్ కి దూరంగా జరుగుతూ, మంచి సినిమా అనే బిరుదును చంకలో పెట్టుకుని తిరుగుతుంది. మరి ఫైనల్ రిజల్ట్ ఏమవుతుంది అనేది ఈవారంతానికి తెలిసిపోతుంది.

శర్వా అది ఎలా రియలైజ్ అవుతాడు, రియాలిటీలోకి ఎప్పుడొస్తాడో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories