Telugu

మన సమాజం ప్రెజంట్ స్టేటస్ ఏమిటి?

ఒకప్పుడు… అంటే సుమారు 100-150 సంవత్సరాల క్రితం మన దేశంలో సామాజిక పరిస్థితులు ఒకలా ఉండేవి. సతీసహగమనం, బాల్య వివాహాలు, అంటరానితనం వంటి అనేక అవలక్షణాలు సమాజాన్ని పీడిస్తుండేవి. ఎందరో మహానుభావుల కృషి పుణ్యమాని వాటన్నిటినీ వదిలించుకోగలిగాము.

కనుక ఇప్పుడు సమాజ పరిస్థితి బాగుందా?అంటే అవునని చెప్పలేము. ఇప్పుడు భర్తని, భార్య, భార్యని భర్త, సొంత పిల్లలని విషం పెట్టి చంపుకోవడం, చిన్నారులపై అత్యాచారాలు వంటి వార్తలు రోజూ వింటున్నప్పుడు మన సమాజం ‘ప్రెజంట్ స్టేటస్’ ఏమిటి? అనే సందేహం కలుగుతుంది.

ADVERTISEMENT

ఇటీవల హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలో ఓ మైనర్ బాలుడు యూట్యూబ్‌ చూసి దొంగతనం ఎలా చేయాలో నేర్చుకున్నాడు. దేనికంటే ‘క్రికెట్ బ్యాట్’ కోసం!

ఇంట్లో రోజూ తల్లితండ్రుల మద్య గొడవలు ఆ పిల్లాడిని ఈవిదంగా చెడు మార్గంలోకి నడిపిస్తే, పొరుగింట్లో బ్యాట్ దొంగతం చేస్తున్నప్పుడు అది చూసిన మైనర్ బాలికని అతికిరాతకంగా కత్తితో అనేకసార్లు పొడిచి హత్య చేశాడు!

ఆ తర్వాత తాపీగా ఆ కత్తికి అంటిన రక్తాన్ని వాళ్ళింట్లోనే వాష్ బేసిన్‌ కడిగేసి ఏమీ జరగనట్లు బ్యాట్ తీసుకొని ఇంటికి వచ్చేశాడు!

ఓ మైనర్ బాలుడు ఇంత దారుణానికి పాల్పడ్డాడంటే లోపం ఎక్కడుంది? ఆ బాలుడి డీఎన్ఏలోనా అతని తల్లితండ్రులలోనా? లేదా సమాజంలోనా? అనేవి శేష ప్రశ్నలే!

తాజాగా అనంతపురం జిల్లాలో మరో విచిత్రం జరిగింది. బుక్కరాయ సముద్రం చెరువు కట్ట వద్ద ఉన్న ముసలమ్మ ఆలయం ఉంది. కొన్నిరోజుల క్రితం దొంగలు పడి హుండీలో సొమ్ము దోచుకుపోయారు.

ఆ కేసుపై పోలీసులు ఇంకా దర్యాప్తు జరుపుతుండగానే సదరు దొంగ ఆ సొమ్ము మొత్తం అణాపైసలతో సహా భద్రంగా మూటగట్టి ఆలయ ఆవరణలో వదిలివెళ్ళాడు.

ఇదే విచిత్రమనుకుంటే, దానిలో అతను వ్రాసి పెట్టిన ఓ లేఖ మనసులను కదిలిస్తుంది. తన పిల్లలు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారని, వారికి చికిత్స చేయించేందుకు తన వద్ద సొమ్ము లేకపోవడం వలననే ఈ పాడుపని చేయాల్సి వచ్చిందని, కానీ తప్పని గ్రహించి దేవుడి సొమ్ము వాపసు ఇచ్చేస్తున్నానని ఆ లేఖలో వ్రాశాడు సదరు దొంగ. ఆలయ సిబ్బంది ఆ సొమ్ము లెక్కించి చూడగా మొత్తం రూ.1,86,486 ఉంది.

సమాజంలో మంచి చెడులు రెండూ ఎప్పుడూ ఉంటాయని ఇవి నిరూపిస్తున్నాయి. అయితే మంచిని చెడు ‘డామినేట్’ చేసేందుకు అనేక అవకాశాలు, మార్గాలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి.

కానీ సమాజం మంచి చెడులతో మనకేమిటి సంబంధం అనుకోవచ్చు. ఆ సమాజంలో మనమూ భాగమే అని మరిచిపోకూడదు. ఇటువంటి మంచి చెడులు మనకీ ఎదురవవచ్చు.

అలాగని సమాజం బాగా ఉండాలని ప్రత్యేకంగా ఎవరూ ప్రయత్నించకపోయినా మన పిల్లలు అటువంటి మంచి సమాజంలో ఉండాలని కోరుకుంటాము. అందుకే చిన్నారులకు మంచి నేర్పిస్తుంటాము. కానీ సమాజంలో జరిగే చెడుని ఎదుర్కొని పోరాడలేకపోయినా జరిగే మంచిని ప్రోత్సహించవచ్చు, అది చాలా అవసరం కూడా. అప్పుడే మరో మంచి ప్రయత్నం జరుగుతుంటుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Fauzi New Release Date: But Why Don’t Fans Believe It?

Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…

37 minutes ago

Desi Man Arrested at US Airport: H-1B Revoked

The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…

57 minutes ago