ఖబడ్ధార్… గట్టిగానే ప్లాన్ చేసినట్లున్నాడు..!

Shyam Singha Roy Teaser“శ్యామ్ సింగరాయ్”తో తన స్టామినా ఏంటో నాచురల్ స్టార్ నిరూపించుకోబోతున్నారన్న సంకేతాలను లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టీజర్ స్పష్టం చేస్తోంది. ‘స్త్రీ ఎవరికీ బానిస కాదు… ఆఖరికి దేవుడికి కూడా… ఖబడ్ధార్… ‘ అంటూ ఇతర భాషలో నాని చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ ఈ టీజర్ లో ఉంది.

రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని టీజర్ షాట్స్ లో సినిమాటోగ్రాఫర్ సాను జాన్ వరగేసే కెమెరా పనితనానికి అద్దం పడుతున్నాయి. అలాగే మిక్కి జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాయి పల్లవి లుక్స్ టీజర్ లో ఇతర ఆకర్షణలు. ‘ఉప్పెన’ హాట్ బ్యూటీ కృతి శెట్టి లిప్ లాక్ టీజర్ క్లైమాక్స్ షాట్.

ADVERTISEMENT

హిస్టారికల్ ‘శ్యామ్ సింగరాయ్’ క్యారెక్టర్ తో పాటు లేటెస్ట్ రోల్ లోనూ నాని కనిపించనున్నాడు. డిసెంబర్ 24వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాపై నాని చాలా ఆశలనే పెట్టుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా ఏకకాలంలో విడుదల కాబోతోంది.

ADVERTISEMENT
Latest Stories