ఎన్టీఆర్ అన్న… నా ఫస్ట్ అవార్డు ఇచ్చేసావ్..!

sidhu jonnalagadda thanks note to jr ntr‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళిలు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చేసిన విషయం తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలలో తమ సినిమాలతో పాటు ఇతర సినిమా విశేషాలను కూడా ప్రస్తావించగా, అందులో “డీజే టిల్లు” సినిమాను ఉద్దేశించి జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

“డీజే టిల్లు”లో హీరోగా నటించిన సిద్ధు చాలా బాగా నటించాడని, టీవీ ద్వారా పరిచయం అయ్యి, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ కు వచ్చి మెప్పించడం, ఈ సినిమాలో సిద్ధు నటనను తాను బాగా ప్రేమించానని చెప్పిన ఎన్టీఆర్ మాటలను పోస్ట్ చేస్తూ కృతజ్ఞతలు చెప్తూ ఆనదంలో మునిగితేలారు మన డీజే హీరో.

ADVERTISEMENT

ఎన్టీఆర్ అన్న… నా ఫస్ట్ అవార్డు ఇచ్చేసావ్ అన్న. చాలా చాలా థాంక్స్. ప్రస్తుతం సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నాను, మాటలు దొరకడం లేదు. మిమ్మల్ని టైగర్ అని అందుకే అంటారు. బిగ్ బిగ్ హగ్ అండ్ ప్రేమతో అంటూ మిక్కిలి సంతోషంతో సిద్ధు జొన్నలగడ్డ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.

ఎన్టీఆర్ చెప్పింది నిజమే. ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాలలోనూ జోష్ ఫుల్ నటనతో ఇండస్ట్రీలో అవకాశాలు తెచ్చుకుంటున్న సిద్ధు, ‘డీజే టిల్లు’లో మరింత చెలరేగిపోయే విధంగా నటించాడు. అదే సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ కూడా! దానిని ఎన్టీఆర్ స్థాయి నటుడు మెచ్చుకున్నపుడు సిద్ధు లాంటి వారు ఆకాశంలో విహరించినట్లే!

ADVERTISEMENT
Latest Stories