
Sidiri arrest fuels political debate
ఓదార్పు అంటే బాధితులకు మేమున్నాం అనే భరోసా. అయితే ఇప్పుడు ఆ ఓదార్పు కి అర్ధం మార్చే పనిలో పడింది వైసీపీ. పలాస వైసీపీ మాజీ ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు కుమారుడి హిట్ అండ్ రన్ కేసులో వైసీపీ ఓదార్పు వినూత్నంగా బాధిత కుటుంబానికి కాకుండా నిందితుల కుటుంబానికి దక్కింది.
సిదిరి తనయుడు చేసిన హిట్ అండ్ రన్ లో ఒక గొర్రెల కాపరి ప్రాణాలు కోల్పోయాడు. అటువంటి నిరుపేద కుటుంబం ఇంటి పెద్దను కోల్పోతే ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన రాజకీయ నాయకులు, ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సిన వారు, వారికీ న్యాయం కోసం పోరాడాల్సిన నేతలు ఆశ్చర్యంగా ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని నింపిన సిదిరి కుటుంబాన్ని పరామర్శించారు.
దీనితో వైసీపీ ‘ఓదార్పు’ కి అర్ధం మార్చే పనిలో పడిందా.? ‘పరామర్శ’కు కొత్త అర్ధాన్ని చెప్పే బాధ్యత తీసుకుందా.? అంటూ వైసీపీ నేతల ఓదార్పు మీద సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. మొన్న సాయికృష్ణ విషయంలో చిన్నపిల్లాడు తెలిసితెలియక తప్పులు చేసాడు అంటూ సాయికృష్ణ చీకటి కోణాన్ని సమర్ధించిన జగన్ నేడు సిదిరి తనయుడి తప్పుని కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేసారు.
సాయికృష్ణ లాకప్ డెత్ పట్ల అధికారులను నిందించి, సాయికృష్ణ కుటుంబానికి మద్దతు పలికి, కుల రాజకీయాలు నడిపిన వైసీపీ, ఇప్పుడు అదే సిదిరి తనయుడి విషయానికొచ్చేసరికి హిట్ అండ్ రన్ లో మరణించిన కుటుంబానికి కాకుండా ప్రాణాలు తీసిన కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్నారు.
వైసీపీ దృష్టిలో చట్టం పార్టీని బట్టి, న్యాయం వ్యక్తిని బట్టి, ధర్మం పరిస్థితిని బట్టి మారుతుందా.? సిదిరి విషయంలో వైసీపీ ఎన్ని ఓదార్పు రాజకీయాలు చేసినా చివరికి చట్టం తన పని తానూ చేస్తుంది అని కూటమి ప్రభుత్వం, నిరూపించి చూపించింది.
సిదిరి తన తనయుడిని తప్పించే ప్రయత్నం చేసాడు అనే ఆరోపణతో A3 గా ఆయన మీద పోలీసులు కేసు నమోదు చేసారు. ఇక నిన్న బుధవారం సాయంత్రం కాశీబుగ్గ లో తన నివాసంలో సిదిరిని అరెస్టు చేసిన పోలీసులు నేడు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీనితో పలాస కోర్ట్ సిదిరి అప్పలరాజుకి 14 రోజుల రిమాండ్ విధించింది.
Drishyam: The Conclusion is creating a lot of buzz with a few more days left…
Eshaanya Mmaheshwari is turning up the heat and setting major fashion goals in her latest…