
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఏపీ ప్రభుత్వం 2014లో స్కిల్ డెవలప్మెంట్ కోసం మమ్మల్ని సంప్రదించింది. అప్పుడు ప్రభుత్వం, సీమెన్స్ సంస్థలు 90:10 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టాలని ఒప్పందం చేసుకొన్నాము. మా కంపెనీ తరపున మా సీఎఫ్వో, నేను సంతకాలు చేయగా ప్రభుత్వం తరపున ఏపీస్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎస్ఎస్డిసి) అధికారులు సంతకాలు చేశాము.
ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 200 ల్యాబ్స్ ఏర్పాటు చేసి వాటిలో 2021 వరకు 2.32 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్లు ఇచ్చాము. ఆ సర్టిఫికేట్లతోనే వారందరూ వివిద సంస్థలలో ఉద్యోగాలు సంపాదించుకొన్నారు కూడా. మా సంస్థ ఇచ్చిన శిక్షణతో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని ఎస్ఎస్డిసి మెచ్చుకొంది కూడా.
కానీ ఇప్పుడు ఆ సంస్థ కూడా ఈ ప్రాజెక్ట్ బోగస్ అని వాదిస్తుండటం మాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆనాడు ఎస్ఎస్డిసి మా కంపెనీతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయడం అబద్దమా? ఆనాడు ప్రభుత్వం తరపునే అధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు కదా?మరి వాటి గురించి ఏపీ సీఐడి అధికారులు ఎందుకు పేర్కొనడం లేదు? ఆ ఒప్పందం, దానిపై వారు సంతకాలు చెల్లవంటే ఎస్ఎస్డిసి ప్రభుత్వంలో భాగం కాదా?
ఈ తప్పుడు వాదనలు, ఆరోపణలు వింటుంటే ఏడ్వాలో నవ్వాలో కూడా తెలీడం లేదు. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకొని 2.32 లక్షల మందికి శిక్షణ ఇచ్చి, సర్టిఫికేట్లు ఇస్తే వారందరూ ఉద్యోగాలు చేసుకొంటుంటే, అసలు ‘స్కిల్లూ లేదు… డెవలప్మెంటూ లేదు… అంతా బోగస్’ అని వితండవాదం చేస్తున్నారు.
ఇదెలా ఉందంటే బ్రతికున్న మనిషి హత్యకు గురయ్యాడని విచారణ జరుపుతున్నట్లే ఉంది. మావద్ద స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు సంబందించి ఆనాడు ఏపీ ప్రభుత్వంతో చేసుకొన్న ఒప్పందంతో సహా అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. అవసరం పడినప్పుడు వాటన్నిటినీ మేము కోర్టుకు సమర్పిస్తాము. తప్పుడు ఆరోపణలతో తప్పుడు కేసు నమోదు చేయడం సరికాదు,” అని అన్నారు.
Elon Musk has become the first person in history to reach a trillion-dollar net worth,…
The Ramayana teaser has given audiences an idea of the scale Namit Malhotra is planning…