Silpa ravichandra reddy

లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా అన్న పవన్ సినిమాలో డైలాగ్ ను అల్లు అర్జున్ ఆచరించి చూపించారు. అయితే ఆ కిక్కు ఎవరికీ వచ్చిదనేది మరికొన్ని రోజులలో తేలనుంది. అయితే అసలు విషయానికి వస్తే వైసీపీ కి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసి తానూ తగ్గి రాష్ట్రాన్ని నెగ్గించాలి అంటూ జగన్ కు వ్యతిరేకంగా శిఖండిలా పోరాడారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

కూటమి విజయం కోసం మూడు పార్టీల కార్యకర్తలను, నాయకులను ఒక తాటి పైకి తీసుకురావడనికి తనవంతు కృషి చేసిన పవన్ వైసీపీని గద్దె దింపడమే ఏకైక లక్ష్యంగా ఎన్నికల ప్రచారం సాగించారు. అయితే ఎన్నికల ప్రచారానికి చివరి నిముషంలో పవన్ తో పాటు కూటమి పార్టీలకు అనుకోని షాక్ ఇచ్చారు అల్లు అర్జున్. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి కి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాల కు వచ్చారు.

Also Read – మ్యాజిక్ ను రిపీట్ చేయగలరా..?

జనసేన పవన్ గెలుపు కోసం X లో స్పందించిన అల్లు అర్జున్, పవన్ ప్రత్యర్థి గెలుపు కోసం మాత్రం స్వయంగా వచ్చి మరి మద్దతు తెలియచేసారు. దీనితో కూటమి పార్టీల మద్దతుదారులతో పాటుగా మెగా అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు అల్లు. అయితే పార్టీలకు అతితీతంగా తన స్నేహితుడి కోసం శిల్పా రవికి మద్దతు ప్రకటించాను అంటూ మెగా అభిమానుల గాయానికి ఆయింట్ మెంట్ పూయడానికి ప్రయత్నించిన అల్లు అర్జున్ కు వైసీపీ పంచ్ వేశారు శిల్పా రవి.

జగన్ మెప్పుకోసం మీడియా ముందుకొచ్చిన శిల్పా ఏకకంగా పవన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. పవన్ ఒక ప్యాకేజీ స్టార్, పవన్ బాబు దత్తపుత్రుడు అంటూ వైసీపీ స్క్రిప్ట్ చదివారు శిల్పా రవి చంద్రా రెడ్డి. తానూ సినీ ఇండస్ట్రీలో ఎదగడానికి తనవంతు సాయమందించిన పవన్ ను ఈవిధంగా హేళన చేస్తున్న నాయకులకు అల్లు అర్జున్ మద్దతు తెలియచేయడం అంటే చేయూతనిచ్చిన చేతిని నరికినట్టే.

Also Read – వైసీపీ మళ్ళీ ‘మెగా’ బకరా అయ్యిందా.?

ఇటువంటి వాడి గెలుపు కోసమా నంద్యాల వచ్చి మరి ఆయనకు మద్దతు తెలియచేసింది అంటూ అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో కౌంటర్లు పేలుతున్నాయి. శిల్పా నంద్యాల ఎన్నికల ప్రచారంలో ఎక్కడ పవన్ పేరు ఎత్తలేదు కానీ పోలింగ్ తంతు పూర్తవగానే పవన్ ఒక ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శించడం వైసీపీ వక్ర బుద్దిని బయటపెట్టినట్టయ్యింది. శిల్పా రవి చంద్రా రెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తున్నారు మెగా అభిమానులు.




Also Read – ఆ పాఠాలు మనోడికి కూడా వర్తిస్తాయిగా?