
హేమకుంత్ ఎక్స్ ప్రెస్ లో జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు నిందితుడికి 5 లక్షల రూపాయిల ఫైన్ వేసింది రైల్వే శాఖ. అసలు విషయానికి వస్తే, హేమకుంత్ ఎక్స్ ప్రెస్, థర్డ్ ఏసీ లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు ట్రైన్ లో ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేసారు.
అయితే ఆ బాటిల్ మీద ఉన్న MRP కన్నా ట్రైన్ క్యాటరింగ్ సిబ్బంది ఎక్కువ ధరకు ఆ బాటిల్ ను విక్రయించడంతో సదరు వ్యక్తి ‘రైల్ మదద్’ యాప్ ద్వారా రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసారు. దీనితో విషయం తెలుసుకున్న క్యాటరింగ్ సిబ్బంది ఒక బ్యాచ్ లా వచ్చి కంప్లైన్ట్ రైజ్ చేసిన వ్యక్తితో వాగ్వాదానికి దిగి అతడి మీద దాడికి పాల్పడ్డారు.
అయితే ఈ వివాదాన్ని మొత్తం ఫోన్ లో రికార్డు చేసిన బాధితుడు, అధిక ధరల గురించి ప్రశ్నిస్తే చంపేస్తారా.? అంటూ తనకు జరిగిన అన్యాయానికి న్యాయం కావాలంటూ మొత్తం వ్యవహారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీనితో సదరు రైల్వే క్యాటరింగ్ సిబ్బంది తీరు పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడం తో ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడం, రైల్వే అధికారులు దాని పై స్పందించడం చెకచెకా జరిగిపోయింది.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం,ఈ దుస్సాహసానికి పాల్పడిన సిబ్బంది పై 5 లక్షల రూపాయిల జరిమానా విధిస్తున్నాం, కథువా రైల్వే పోలీసులు వీరి పై కేసు నమోదు చేయడం జరిగింది, అతని పై విచారణకు ఆదేశిస్తున్నాం, ఇటువంటి పనులకు పాల్పడిన వ్యక్తుల పై ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటూ అంటూ రైల్వే శాఖ నుంచి ఆదేశాలు జారీ అయాయ్యి.
దీనితో సదరు బాధితుడికి సత్వర న్యాయం జరిగింది, నిందితుడికి తక్షణ శిక్ష పడిందంటూ నెటిజన్లు ఈ వార్తను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియా తో చెడే కాదు మంచి కూడా జరుగుతుందంటూ ఈ ఘటన రుజువుచేసినట్లయ్యింది.
Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…
GV Prakash Kumar has delivered several memorable albums in South Indian cinema, but Bollywood is…