పాపం శ్రీవిష్ణు.. ప్రతిసారీ అతనే బుక్ అవుతున్నాడు

Sree Vishnu attending multiple Telugu film events as chief guest causing overexposure debate

ఒక్కోసారి ఇండస్ట్రీలో అజాతశత్రువుగా ఉండడం కూడా తప్పేనేమో అనిపిస్తుంది. ఎవరికీ నో చెప్పలేక, ఎవరినీ నొప్పించలేక తాము బలైపోతుంటారు కొందరు. ఆ లిస్టులో ఇప్పుడు శ్రీవిష్ణు చేరాడు. గత కొన్నిరోజులుగా ఏ చిన్న సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లేదా రోస్ట్ ఈవెంట్ చూసినా శ్రీవిష్ణు చీఫ్ గెస్టుగా కనిపిస్తున్నాడు.

అలా అన్నీ సినిమాలకి సపోర్ట్ చేయడం అనేది స్వాగతించాల్సిన విషయమే కానీ.. కొన్నేళ్లక్రితం ప్రతి సినిమా ఈవెంట్ లో తమ్మారెడ్డి, ప్రసన్న కుమార్లు కనిపించినట్లుగా ఇప్పుడు శ్రీవిష్ణు కనిపిస్తుండడం అనేది చర్చనీయాంశం అయ్యింది. తనకు వీలైంతలో ఏదో మ్యానేజ్ చేస్తున్నాడు కానీ.. ప్రతి ప్రీరిలీజ్ ఈవెంటు కనీసం 8 గంటలకి కానీ మొదలవ్వకపోవడం,, 10.30 దాకా పూర్తవ్వకపోవడం అనేది గెస్టులకి మాత్రమే కాక మీడియాకి కూడా తలనొప్పిగా మారింది.

ADVERTISEMENT

ఇక శ్రీవిష్ణు విషయానికి వస్తే.. ఈటీవీ విన్ సంస్థ నిర్మించే అన్ని సినిమాలకి ఆయన కామన్ గెస్ట్. ఇక బన్నీ వాసు & వంశీ నందిపాటి ఇన్వాల్వ్ అయ్యారంటే శ్రీవిష్ణు ప్రెజన్స్ ఉండాల్సిందే. అందువల్ల గత ఆరునెలల్లో తక్కువలో తక్కువ ఒక 30 ఈవెంట్లకి శ్రీవిష్ణు హాజరయ్యాడు.

అందువల్ల శ్రీవిష్ణు ఒక ఈవెంట్ కి గెస్ట్ గా వస్తున్నాడు అంటే ఆసక్తికరంగా కాక కామన్ అయిపోయి బోర్ కొట్టేసింది కూడా. గెస్ట్ వల్ల సినిమాకి ఎంత ఉపయోగం అనేది తెలియదు కానీ.. ఇలా ప్రతీ ఈవెంట్ కి శ్రీవిష్ణుని ఫేస్ ఆఫ్ ది ఈవెంట్ లా మార్చేయడం వల్ల ఫ్యూచర్ లో తన ఈవెంట్ లో తాను మాట్లాడినా జనాలు పట్టించుకోని పరిస్థితి ఎదురవ్వచ్చు.

ADVERTISEMENT
Latest Stories