జగన్… పవన్… మధ్యలో ఆమె..!

Sri Reddy allegations on tollywood star daughterతనపై చేసిన విమర్శలను లైట్ తీసుకున్న పవన్ కళ్యాణ్, వాతావరణాన్ని చల్లబర్చే ప్రక్రియ చేసాడు. అయితే సోషల్ మీడియాలో జగన్ అండ్ కోకు వ్యతిరేకంగా ప్రచారం మాత్రం జరుగుతూనే ఉంది. ఇది తట్టుకోలేని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ద్వారా హాట్ హాట్ కామెంట్స్ కు తెరలేపింది. విమర్శించకుండానే విమర్శించిన విధంగా చిరంజీవి ఫ్యామిలీలో జరిగిన ఉదంతాలను ప్రస్తావించింది.

[m9ad]

ADVERTISEMENT

“చిరంజీవి గారి మొదటి కూతురికి ఎన్ని ఎంగేజ్మెంట్లు జరిగాయని అడిగామా? లేదే, శ్రిజకి ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి అని అడిగామా? లేదే..! ఎందుకంటే మేం మహిళలను గౌరవిస్తాం, షర్మిలమ్మ ఏం చేసిందిరా మధ్యలో, ఆడోళ్ళ జోలికోస్తున్నారు, పవన్ కళ్యాణ్ కి పెళ్ళిళ్ళ మీద ఉన్న శ్రద్ధ స్పెషల్ స్టేటస్ మీద ఉండుంటే ఎప్పుడో ఇచ్చేవాడు మోడీ” అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది.

అంతకుముందు కూడా జగన్ కు సపోర్ట్ గా ఉంటూ వస్తోన్న శ్రీరెడ్డి, వైసీపీకి అనుకూలంగా అనేక పోస్ట్ లు పెట్టింది. అంతేకాకుండా జగన్ చేసిన కామెంట్స్ కు అన్ని సాక్ష్యాలు ఉన్నాయని, మరి పవన్ చేస్తోన్న అవినీతి ఆరోపణలకు సాక్ష్యాలు ఉన్నాయా? అంటూ ఎదురు ప్రశ్నించింది. శ్రీరెడ్డి చేసిన పోస్ట్ లపై యధావిధిగా పవన్ ఫ్యాన్స్ మండిపడుతూ రిప్లైలు ఇస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories