
యూరీ ఘటన నేపథ్యంలో బాలీవుడ్ చిత్రాల్లో నటించిన పాకిస్థాన్ కళాకారులను భారత్ నుంచి వెళ్లిపోవాలంటూ నాడు నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అప్పటినుండి పాకిస్తాన్ నటులకు బాలీవుడ్ అవకాశాలు తగ్గగా, ‘ఏ దిల్ హై ముష్కిల్,’ ‘రయీస్’ చిత్రాలలో పాక్ నటులు నటించడంతో పెద్ద చర్చ కూడా జరిగింది. ‘ఏ దిల్ హై ముష్కిల్’ చిత్రం అనేక హెచ్చరికల నేపధ్యంలో విడుదల కాగా, షారుక్ ‘రయీస్’ త్వరలో విడుదల కానుంది.
‘మామ్’ చిత్రంలో నటిస్తున్న పాకిస్థానీ నటీనటులకు భారత్ వీసాలు మంజూరు కావడంతో ఈ సినిమా షూటింగ్ కి కూడా ఇకపై అవరోధాలు ఉండవు. ఈ సందర్భంగా పాకిస్థాన్ నిర్మాత మహ్మద్ మండ్వివాలా మాట్లాడుతూ, ఈ ఘటన ఇరు దేశాల మధ్య స్నేహబంధాన్ని పెంచుతుందని ఆకాంక్షించారు. గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తానీ నటులు బాలీవుడ్ సినిమాలలో సందడి చేయడం షరామామూలుగా మారిపోయింది.
Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam has collected approximately Rs. 36 crores gross worldwide in its first two…
పులివెందులలో జరిగిన అల్లర్లు, పోలింగ్ సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, వైసీపీ అధినేత జగన్మోహన్…