మెగా క్యాంప్ లో ‘బ్రహ్మోత్సవం’ దర్శకుడు!

srikanth-addala-mega-heroప్రిన్స్ మహేష్ బాబుతో ‘బ్రహ్మోత్సవం’ వంటి ఫలితాన్ని చవిచూసిన తర్వాత శ్రీకాంత్ అడ్డాల భవిష్యత్తుపై సినీ వర్గాల్లో ప్రశ్నలు చెలరేగాయి. అడ్డాల ప్రతిభకు సంబంధించి చర్చ కాకపోయినా, తదుపరి అవకాశం ఏ హీరో ఇస్తారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. దీనిపై మీడియా వర్గాలు అడ్డాలను ప్రశ్నించిన సమయంలో కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో, కుటుంబ చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ కెరీర్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఇండస్ట్రీలో ఒక్క సినిమా ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుందో, గతంలో ‘1 నేనొక్కడినే, ఆగడు’ సినిమాలతో నిరూపణ అయ్యింది. టాలెంట్ ను మించి సక్సెస్ ను మాత్రమే కొలమానంగా తీసుకునే సినీ ప్రముఖులు శ్రీకాంత్ కు మరో అవకాశం ఇస్తారా..? అన్న సందేహాలకు తాజాగా ఓ స్పష్టత వస్తోంది. టాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్స్ ని అందించే బ్యానర్ గా పేరు తెచ్చుకున్న ‘గీత ఆర్ట్స్’లో శ్రీకాంత్ అడ్డాల తదుపరి సినిమా ఉంటుందని తెలుస్తోంది.

ADVERTISEMENT

దీనికి సంబంధించి ఇప్పటికే శ్రీకాంత్ అడ్డాలకు గ్రీన్ సిగ్నల్ లభించిందని, అయితే హీరో ఎవరనే విషయంపై క్లారిటీ రావాలని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే వరుణ్ తేజ్ తో ‘ముకుంద’ సినిమా చేసిన శ్రీకాంత్ మళ్ళీ వరుణ్ నే డైరెక్ట్ చేస్తారా మరో మరో మెగా హీరోకు అవకాశం లభిస్తుందా అనేది వేచిచూడాలి. చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందించే విధంగా ప్లాన్ జరుగుతున్న ఈ సినిమా అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories