
అవసరముంటే ఆదరించడం, అడ్డనుకుంటే నిర్దాక్షణ్యంగా పక్కన పెట్టేయడం వైసీపీ ఆడే రాజకీయ చదరంగంలో ఒక భాగం. అందుకు తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల సైతం అతీతులు కారు అని ఇప్పటికే నిర్ధారణ అయ్యింది.
ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఆ పార్టీ ముఖ్య నాయకులు, జగన్ కు సన్నిహితులు భూమన కరుణాకర్ రెడ్డి ఓ మహిళా ప్రభుత్వాధికారి పై చేసిన కొన్ని విమర్శలు ఆ పార్టీ తాలూకా రాజకీయ చదరంగాన్ని మరోసారి బయటపెట్టాయి.
శ్రీ లక్ష్మి తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని ఒక ఐఏఎస్ అధికారి. జగన్ అక్రమాస్తుల కేసులో, ఓబుళాపురం మైనింగ్ కేసులో దోషిగా కొన్నాళ్ళు జైలు శిక్ష కూడా అనుభవించిన శ్రీలక్ష్మి వైసీపీ ప్రభుత్వం ఏర్పడడంతో తిరిగి ఏపీకి తరలి వచ్చారు.
తన కోసం జైలుకెళ్లోచ్చిన శ్రీ లక్ష్మి త్యాగానికి గుర్తింపుగా జగన్ ఆమెను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకొచ్చారు. అయితే నాడు వైసీపీ తీసుకొచ్చిన శ్రీ లక్ష్మి పై నేడు అదే వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.
TDR బాండ్ల విషయంలో తన పై వచ్చిన ఆరోపణలకు వైసీపీ పాలనలో పని చేసిన ఓ మహిళా ఐఏఎస్ అధికారి కారణమంటూ నింద మొత్తాన్ని శ్రీ లక్ష్మి మీద నెట్టి భూమన తన పై వచ్చిన అవినీతి మరకలను తుడుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
మంత్రువులను ఆమె పూచిక పుల్ల మాదిరి చూస్తుందని, తిరుపతిలో రోడ్లు వేసే సమయంలో స్థలాలు కోల్పోయిన వారిని TDR బాండ్ల పేర్లతో దోపిడీ చేసి కోట్లు కొల్లగొట్టారంటూ శ్రీ లక్ష్మి కి అవినీతి మరకలు వేశారు భూమన.
అయితే జగన్ ఏరి కోరి తెచ్చుకున్న మహిళా ఐఏఎస్ పై జగన్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పబడే భూమనే అవినీతి ఆరోపణలు చేస్తుంటే ఈ ఆరోపణలకు జగన్ మద్దతు ఉన్నట్టా.? లేనట్టా.?
అవసరానికి అడ్డం పెట్టుకోవడం అడ్డొస్తున్నారు అని తెలిస్తే అవినీతి మరకలు వేసి, విమర్శలు ఎక్కుపెట్టి అడ్డు తప్పించడం వైసీపీ కి కొత్తేమి కాదు అంటున్నారు శ్రీ లక్ష్మి పై భూమన వ్యాఖ్యలను గమిస్తున్న వారు.
చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా అన్నట్టుగా గతంలో జగన్ ను నమ్మి కోర్టుల చుట్టూ తిరుగుతూ జైళ్ళతో సహవాసం చేసిన ఐఏఎస్ శ్రీ లక్ష్మి ఇప్పుడు మరో సారి జగన్ పై విశ్వాసంతో ఏపీకి తిరిగి వస్తే అదే వైసీపీ నేతల నుంచి అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.
మరి ఈ సమస్య నుంచి శ్రీలక్ష్మిని బయటపడేసేందుకు జగన్ బయటకొస్తారా.? లేకపోతే మరో మూడేళ్లు కళ్ళు మూసుకోండి తిరిగి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరిస్తాను అంటూ హామీ ఇచ్చి తప్పించుకుంటారా.?
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…