Telugu

కొంప ముంచిన శ్రీనివాస్ గౌడ్ హోం టూర్

ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు.. తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోట్లాది రూపాయలు వెచ్చించి కట్టుకున్న తన ఇంటిని నలుగురుకీ చూపాలనుకోవడం కొంప ముంచింది.

హైదరాబాద్‌లో అత్యంత సంపన్నుల కొరకు ప్రత్యేకంగా శ్రీ ఆదిత్య రిజర్వ్ విల్లాస్ అనే ఓ గేటడ్‌ కమ్యూనిటీలో శ్రీనివాస్ గౌడ్ కూడా ఓ ఇల్లు కొనుకున్నారు. ఆ ఇంటికి ఓ యూట్యూబర్‌ని ఆహ్వానించి ‘హోమ్ టూర్’ వీడియో తీయించగా ఆమె దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ADVERTISEMENT

అంతే.. అప్పటి నుంచి అయనపై విమర్శలు మొదలైపోయాయి. ఎందుకంటే, ఒకప్పుడు అయన ఓ సాధారణ గెజిటెడ్ అధికారి. అప్పుడు సామాన్య ప్రజలతో కలిసి కూకట్‌పల్లిలో నివసించేవారు.

కానీ కేసీఆర్‌ ప్రభుత్వంలో మంత్రిగా చేసేసరికి ఆయన అమాంతం కోటీశ్వరుడైపోయారు! ఇంద్రభవనం వంటి ఆయన ఇంటి విలువ సుమారు 50 కోట్లు పైమాటే. ఇల్లు కాక ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులున్నాయో? ఇవన్నీ ఎలా సంపాదించారనేది ఇప్పుడు అందరి ప్రశ్న.

ఓ పక్క కేసీఆర్‌ కుటుంబం, బీఆర్ఎస్‌ పార్టీ నేతల ఆస్తులపై సిఎం రేవంత్‌ రెడ్డి విచారణ జరిపిస్తున్న ఈ సమయంలోనే, శ్రీనివాస్ గౌడ్ తన విలాసవంతమైన ఇంటిని ప్రదర్శనకు పెట్టడంతో బీఆర్ఎస్‌ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది.

తెలంగాణ ఏర్పడితే సామాన్య ప్రజల బతుకులు బాగు పడతాయనుకుంటే, కనీసం తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోలేదు.

ఇక తెలంగాణలో నిరుపేద, బడుగు బలహీన వర్గాల ప్రజలు, సన్నచిన్నకారు రైతుల సంగతి సరేసరి. అభివృద్ధి, ప్రాజెక్టుల పేరుతో వారి భూములు గుంజుకోవడంతో వారిలో చాలా మంది రోడ్డున పడ్డారు.

అందుకే తెలంగాణ వస్తే కేవలం కల్వకుంట్ల కుటుంబం ఒక్కటే బాగుపడిందని సిఎం రేవంత్‌ రెడ్డి పదేపదే ఆరోపిస్తూనే ఉన్నారు.

అయితే మా ఒక్క కుటుంబం మాత్రమే కాదంటూ.. బీఆర్ఎస్‌ పార్టీలో మరో అరడజను పేర్లు చదివి వినిపించారు కల్వకుంట్ల కవిత. కానీ తాను ఆణిముత్యమని ఆమె భావిస్తున్నారు కనుక మిగిలిన అందరి అక్రమాస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఓ సాధారణ ప్రభుత్వోగిగా జీవితం మొదలుపెట్టిన శ్రీనివాస్ గౌడ్ విలాసవంతమైన ఇంటిని చూస్తే, కవిత ఆరోపణలు అబద్దం కావని అర్ధమవుతోంది.

కనుక పాడి ఆవు వంటి తెలంగాణ రాష్ట్రం ఎవరి అధీనంలో ఉంటే వారే దాని పాలు పిండుకుంటారన్న మాట. అందువల్లే ఆ పాడి ఆవు చేజారిపోకుండా కాపాడుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ, దానిని ఎలాగైనా మళ్ళీ దక్కించుకోవాలని బీఆర్ఎస్‌ పార్టీ ఆరాటపడుతున్నాయేమో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Manasa to Star Opposite Sharwa in George Krish

Sankranti 2027 is shaping up to be a busy season for Sharwa, who is gearing…

26 minutes ago

The Vvaan: Decent Buzz, Then Why Trade Experts Worried?

After delivering a lineup of flops, Siddharth Malhotra is aiming to win the heart of…

26 minutes ago