సుప్రసిద్ధ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా “వరుడు” సినిమా ఎలాంటి ఫలితాన్ని చవిచూసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పటివరకు దర్శకుడిగా గుణ సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టతలంతా ఈ సినిమాతో మసకబారాయి. పెళ్లి యొక్క విశిష్టతలను చాటిచెప్పే విధంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయం చవిచూసింది.
[m9ad]
తాజాగా అదే పెళ్లి కాన్సెప్ట్ తో ‘శతమానం భవతి’ ఫేం సతీష్ వేగేశ్న “శ్రీనివాస కళ్యాణం” అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. నితిన్ – రాశి ఖన్నాలు జంటగా నటించిన ఈ సినిమాకు రివ్యూలు ఆశించిన విధంగా రాలేదు. దీనికి తోడు సోషల్ మీడియాలో ఈ సినిమాపై భారీ నెగటివ్ టాక్ నడుస్తోంది. ఓ రకంగా ఈ సినిమా కాన్సెప్ట్ నచ్చిన వారి కంటే నచ్చని వారి జాబితానే ఎక్కువగా కనపడుతోంది.
నిజానికి పెళ్లి కాన్సెప్ట్ తో తెరకెక్కించిన అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాలు చవిచూసాయి. అంతకుముందు కృష్ణవంశీ “మొగుడు, శశిరేఖాపరిణయం” పేర్లతో తీసిన సినిమాలు కూడా ఇదే రకంగా ప్రేక్షకుల చేత తిరస్కరింపబడ్డాయి. కానీ “శ్రీనివాస కళ్యాణం”పై విడుదలకు ముందు వరకు ఉన్న పాజిటివ్ వైబ్, క్రమంగా తగ్గిపోయి నెగటివ్ టాక్ వరకు వెళ్ళడంతో, అంతిమంగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుందో వేచిచూడాలి.



