ఈ ఫోటోకు కాప్షన్ చెప్పండి చూద్దాం!

srinivasa-kalyanam-working-stillఆగష్టు 9వ తేదీన విడుదలకు సిద్ధమవుతోన్న “శ్రీనివాస కళ్యాణం” సినిమా ప్రమోషన్స్ ను వెరైటీగా ప్లాన్ చేసినట్లున్నారు. ఆ క్రమంలోనే ఓ ఫోటోను పోస్ట్ చేసిన హీరో నితిన్, దీనికి కాప్షన్ చెప్పండి… అంటూ నెటిజన్లను, అభిమానులను కోరాడు. ఇంకేముంది… సోషల్ మీడియా జనులకు అత్యంత ఫన్నీ కాన్సెప్ట్ అయిన పెళ్లి కాన్సెప్ట్ సినిమా కావడంతో, ఈ ఫోటోను చూస్తూ పెళ్లిపై జోకులు వేస్తూ నితిన్ చెప్పిన పనిని పూర్తి చేస్తున్నారు.

ఎవరి సృజనాత్మకత వారిది… అందులో భాగంగానే బోలేడన్నీ కామెంట్స్ వచ్చిపడుతున్నాయి. అందులో ఫన్నీగా ఉండే కొన్ని కామెంట్స్ న పరిశీలిస్తే… ‘పెళ్లి మంచిదే, కాకపోతే ఫ్రీడమే పోతుంది.., వరుడు, వధువు, పంతులు గారు.., ఈ అబ్బాయ్ చాలా మంచి వాడు, హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు.., డైరెక్టర్ : 50 డేస్ సెలబ్రేట్ ఎక్కడ చేసుకుందాం, రాశి : అలా కాదు, 50 కోట్లు దాటాకా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నా! అన్న కామెంట్స్ కు నితిన్ రిప్లైలు కూడా ఇచ్చాడు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories