స్టూడియోలో ఇరుక్కుపోయిన స్టార్ డైరెక్టర్

Star director reportedly stuck in a studio amid career uncertainty and comeback struggles.

“మీరు కథ సిద్ధం చేసుకోండి.. మేం ప్రొడక్షన్ రెడీ చేసుకుంటాం” ఈ డైలాగ్ కోసం ఎంత మంది కొత్త దర్శకులు ఏళ్ల తరబడి వెయిట్ చేస్తుంటారో తెలిసిందే. ప్రతీ సినిమా ఆఫీస్ ముందు బౌండ్ స్క్రిప్ట్ పట్టుకొని తిరుగుతూ.. ఎప్పుడు నిర్మాత ఒకే చెప్తాడు? ఎప్పుడు సినిమా మొదలవుతుంది అని ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటారు చాలామంది. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ పరిస్థితి కూడా ఇలానే తయారయ్యింది అని తెలుస్తోంది.

విషయం ఏంటంటే.. కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలతోపాటు ఓ మెగా డిజాస్టర్, మరో భారీ ఫ్లాప్ సినిమాలు తీసిన ఓ ప్రముఖ దర్శకుడు కొన్నాళ్లుగా కథ”లు” ప్రిపేర్ చేస్తూ ఓ స్టూడియోలు కూర్చుండిపోయాడట. సదరు స్టూడియో ఓనర్ కి ఈ డైరెక్టర్ చెప్పిన ఏ ఒక్క కథ పూర్తిగా నచ్చదు, అది సరిపోదన్నట్లు సదరు స్టూడియోకి వచ్చే ఔత్సాహిక దర్శకుల కథలన్నీ ఈయనకి ఇచ్చి చదివి బాగుందో లేదో చెప్పమని ఆర్డర్ వేస్తుంటాడు.

ADVERTISEMENT

నెలకి కొంత సాలరీ రూపంలో డబ్బు వస్తుంది కదా అని సైలెంట్ గా స్టూడియోలో కూర్చోవాలా? లేక ఇలానే ఉంటే కొన్నాళ్ళకు తానొక దర్శకుడిని ఉన్నాననే విషయం ప్రేక్షకులు మర్చిపోయే అవకాశం ఉంది కదా అని రిస్క్ చేసి బయటికి వచ్చి ఎవరైనా కొత్త నిర్మాతతో సినిమా తీయాలా? అనే మీమాంసలో కొట్టుకు చస్తున్నాడు ఆ స్టార్ డైరెక్టర్.

సదరు దర్శకుడి సున్నిత మనస్తత్వం గురించి బాగా తెలిసిన వాళ్ళందరూ మాత్రం “ఇక్కడే ఉంటే నీ పరిస్థితి అగమ్యగోచరం, త్వరగా ఏదో ఒకటి తేల్చుకుని బయటికి వచ్చేయ్” అని హితవు పలుకుతున్నారు. మరి స్నేహితుల మాట విని బయటికి వచ్చేసి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటాడా? లేక ఎందుకొచ్చిన రిస్క్ లే అనుకొని అక్కడే సాలరీ బేసిస్ మీద స్టూడియోలో కంఫర్ట్ జోన్ లో కూర్చుండిపోతాడా? అనేది తెలియాల్సి ఉంది.

ADVERTISEMENT
Latest Stories