Telugu

యువగళం పాదయాత్రపై దాడి… ఇది హత్యా ప్రయత్నం కాదా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు రోడ్లపై తిరగలేని పరిస్థితులు కల్పిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. టిడిపి యువనేత నారా లోకేష్‌ మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో తాడేరులో యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నప్పుడు, చుట్టుపక్కల భవనాలపై నుంచి రాళ్ళు, సోడాబాటిల్స్‌ విసురుతూ వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.

అదే సమయంలో కర్రలతో సిద్దంగా ఉన్న మరికొందరు యువగళం వాలంటీర్లను చుట్టుముట్టి చితకబాదారు. వైసీపీ కార్యకర్తల దాడులలో యువగళం పాదయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శివరామరాజుతో సహా పలువురు గాయపడ్డారు. మూడు వైపులా నుంచి ఒకేసారి దాడులు జరుగడంతో ఊహించని ఈ పరిణామానికి నారా లోకేష్‌తో సహా అందరూ షాక్ అయ్యారు. అక్కడే ఉన్న పోలీసులు వైసీపీ కార్యకర్తలను అడ్డుకొనే ప్రయత్నం చేయకపోగా వారు కూడా యువగళం వాలంటీర్లపైనే తమ ప్రతాపం చూపడంతో కాసేపు అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యకర్తల భవనాల పైనుంచి వైసీపీ జండాలు ఊపుతూ, టిడిపి శ్రేణులను కవ్వించారు.

ADVERTISEMENT

నారా లోకేష్‌ బృందం పాదయాత్ర చేయబోయే మార్గంలో ముందుగానే చుట్టు పక్కల భవనాలపైకి వైసీపీ కార్యకర్తలు సోడా బాటిల్స్, రాళ్ళు తరలించడం చూస్తే ఇది పక్కా ప్రణాళికతో జరిగిన దాడి అని అర్దమవుతూనే ఉంది. వైసీపీ కార్యకర్తలు ఇలాంటి ఏర్పాట్లు చేసుకొంటున్నారని ముందే తెలిసినప్పటికీ పోలీసులు వారిని నిలువరించలేదని కూడా స్పష్టమవుతోంది.

తమపై వైసీపీ కార్యకర్తలు దాడులను నిరసిస్తూ నారా లోకేష్‌ అక్కడే రోడ్డుపై బైటాయించి పై అధికారులు వచ్చి సంజాయిషీ ఇవ్వాలని, తమపై దాడులు చేసినవారందరినీ తక్షణం అరెస్ట్‌ చేసి కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

పరిస్థితి చేజారుతోందని గ్రహించిన తర్వాత పోలీసులు అక్కడి నుంచి వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టి నారా లోకేష్‌కు నచ్చజెప్పడంతో మళ్ళీ ముందుకు సాగారు.

ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న ఈ భౌతికదాడులు గమనిస్తే, ఒకప్పుడు సీమజిల్లాలకే పరిమితమైన ఫ్యాక్షనిజం రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వ్యాపించిందని అర్దమవుతోంది. ప్రతిపక్ష నేతలు, వారి అనుచరులపై ఈవిదంగా దాడులు జరుతుంటే వారికి రక్షణ కల్పించాల్సిన జిల్లా ఎస్పీలు, సీఐలు, ఎస్సైలు టిడిపి కార్యకర్తల మీదే కేసులు నమోదు చేస్తుంటారు.

అనంతపురం జిల్లాలో జరిగిన ఘర్షణలకు చంద్రబాబు నాయుడే కారణమంటూ ఆయనపై కూడా హత్యానేరం కింద కేసు నమోదు చేయడానికి పోలీసులు వెనకాడలేదు. మరి నిన్న తాడేరులో నారా లోకేష్‌ బృందంపై జరిగిన ఈ దాడి హత్యాప్రయత్నం కాదా?ఈ దాడికి వైసీపీలో ఎవరు బాధ్యులు?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Can Anil Ravipudi Pull Off Nelson-Style Dark Humour?

Anil Ravipudi knows how to make fans laugh, whistle and celebrate in theaters. But what…

13 minutes ago

Bigg Boss Telugu: ROSHA Breakup Confirmed?

Rohith is one of the potential Bigg Boss Telugu contestants who could win the title.…

43 minutes ago