
ఆ సినిమాలో ‘జూనియర్ ఎన్టీఆర్’ పాడిన ‘ఫాలో ఫాలో’ పాటను గుర్తు చేసే విధంగా సమయాన్ని ఫాలో అవ్వాలని సూచిస్తూ… సినిమాలో కీలక సన్నివేశాలలో వినియోగించడమే కాకుండా, బటర్ ఫ్లై థీరి అంటూ ఒక దానిని పరిచయం చేసిన సుకుమార్… ఈ గడియారంలోనూ బటర్ ఫ్లై ను ఉంచాడు. అలాగే, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో విలన్ కు – హీరోకు మధ్య నడిచిన ‘మైండ్ గేమ్’ బాల్స్ ను కూడా పెట్టి ‘గేమ్ ఓవర్’ అంటూ సుకుమార్ అందించిన ‘బహుమతి’కి జూనియర్ ఫిదా అయ్యాడు.
సుక్కూ అందించిన ఈ బహుమతిని తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్… “ఇంతవరకు నా పుట్టినరోజుకు ఇంతవరకూ ఇటువంటి ప్రత్యేకమైన కానుకను అందుకోలేదు… థాంక్స్ సుకుమార్ గారు…” అంటూ తన భావాలను అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటికే ‘నాన్నకు ప్రేమతో’ వంటి వినూత్నమైన సినిమాను తమ హీరోతో తీసిన సుకుమార్, మరో సినిమాకు శ్రీకారం చుడితే చాలు అంటున్నారు అభిమానులు.
Thrigun is one of the star players during the current season of the Bigg Boss…
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is gearing up for a…