
కానీ, ఇది కూడా మున్నాళ్ళ ముచ్చటగానే మిగిలింది. సుమంత్ నుండి విడిపోవడం, ఆ తర్వాత బాలీవుడ్ సినిమాల్లో ప్రయత్నాలు చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్న తర్వాత కీర్తిరెడ్డి తెలుగు ప్రేక్షకులకు పూర్తిగా దూరమైంది. మరి ప్రస్తుతం కీర్తిరెడ్డి ఏం చేస్తోంది? ఎక్కడ ఉంది? తెలుగు సినిమా వర్గాలతో టచ్ లో ఉందా? తన మాజీ భర్త అయిన సుమంత్ తో ఎలాంటి సత్సంబంధాలు కలిగి ఉంది? ఈ ప్రశ్నలన్నింటికి కీర్తిరెడ్డి జవాబు ఇవ్వలేదు గానీ, అభిమానులతో ముచ్చటిస్తున్న సమయంలో సుమంత్ బదులిచ్చారు.
కీర్తిరెడ్డి తనకు ఒక ఫ్రెండ్ లా ఉంటుందని, అప్పుడప్పుడు మాట్లాడుకుంటామని, తనతో విడిపోయిన తర్వాత మరొక పెళ్లి చేసుకున్న ఆమె ప్రస్తుతం బెంగుళూరులో సెటిల్ అయ్యిందని, ఇద్దరు పిల్లలున్నారని, కీర్తిరెడ్డి జీవితం ప్రస్తుతం బాగానే ఉందని కబురందించాడు. దీంతో ఈ ‘తొలిప్రేమ’ బ్యూటీ తాజా పరిస్థితిపై స్పష్టత వచ్చినట్లయ్యింది. అయితే తన భార్య మరొక పెళ్లి చేసుకున్నా, తానూ మాత్రం పెళ్లి చేసుకోనని, ఎవరి పెళ్లికైనా వెళ్తాను గానీ, నా పెళ్ళికి కాదంటూ చమత్కరించారు.
The Telangana Exhibitors Association has officially decided to stop the culture of hiked ticket prices…
నేడు ఎర్రవల్లి ఫామ్‌హౌసులో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. దానిలో పార్టీ కమిటీల ఏర్పాటు,…