నారంగ్ జీ… ఇప్పుడు థియేటర్స్ సేఫ్ అయిపోయాయా?

కోవిడ్ సమయంలో వినాయక చవితి సందర్భముగా థియేటర్స్ లో లవ్ స్టోరీ విడుదల ప్లాన్ చేశారు నిర్మాత సునీల్ నారంగ్. అదే టైం లో డైరెక్ట్ OTT గా అమెజాన్ కూడా టక్ జగదీష్ అదే రోజు ప్లాన్ చేశారు.

అప్పట్లో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో కీలక బాధ్యతల్లో ఉన్న నారంగ్ నైజాంలోని థియేటర్ ఓనర్ల తో సేవ్ థియేటర్స్ అంటూ ఫిల్మ్ ఛాంబర్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ విషయం తరువాత సెటిల్ చేసుకున్నారు అది గతం.

ADVERTISEMENT

సునీల్ నారంగ్ ఆసియన్ గ్రూప్ అఫ్ థియేటర్స్ అధినేత. అవకాశం దొరికినప్పుడల్లా ‘సేవ్ థియేటర్స్’ అంటూ మాట్లాడతారు.

అయితే అదంతా గతం. నారంగ్ తాజా సినిమా ‘మామా మశ్చీంద్రా’ ఈ శుక్రవారం విడుదలై ఘోర పరాజయం పొందింది. రిజల్ట్ ముందే ఊహించారో ఏమో పెద్దగా ప్రమోట్ కూడా చెయ్యలేదు. సరే అది పక్కన పెడితే… సినిమా రెండు వారాలకే OTT లో వచ్చేస్తుంది.

గతంలో సేవ్ థియేటర్స్ అని పోరాడిన నారంగ్… ఇప్పుడు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్… రెండు వారాల్లోనే సినిమా OTT అంటే జీర్ణించుకోవడం కష్టం. సరే అది కూడా కాసేపు తట్టుకుందా.

ఈ రోజు సినిమా విడుదలై మూడు రోజు… ఎంత తక్కువైనా కొంత మంది ఇప్పుడు థియేటర్స్ లో సినిమా చూస్తున్నారు. సరిగ్గా ఇప్పుడే అమెజాన్ అక్టోబర్ 20న పండగ సందర్భంగా అమెజాన్ లో ‘మామా మశ్చీంద్రా’ అంటూ ప్రకటన.

సినిమా డబ్బులు పెట్టి చూస్తున్న, చుసిన ప్రేక్షకులకు, ఆ సినిమాని వేసుకున్న థియేటర్ ఓనర్లకు ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. 

ఛాంబర్ ప్రెసిడెంట్ అనేది పక్కన పెడితే నారంగ్ ఫ్యామిలీ థియేటర్స్ బిజినెస్ లో ఎప్పటి నుండో ఉన్నారు. ఆసియన్ పేరిట చాలా థియేటర్లు ఉన్నాయి ఆయనకు. మరి ఇప్పుడు ‘సేవ్ థియేటర్స్’ స్లోగన్ ఏమైపోయింది. 

కోవిడ్ అయిపోయింది థియేటర్స్ పరిస్థితి వెలిగిపోతుంది అందుకే OTT పరిశ్రమ ని బాగుచేసే ప్రక్రియ మొదలుపెట్టాం అని చెప్పగలరా? సునీల్ గారు పెద్ద మనిషి కాబట్టి ఆయన చెబితే మనమంతా నమ్మాల్సిందే!

సరే థియేటర్స్ పరిస్థితి పక్కన పెడితే… రెండు సునీల్ నారంగ్ సినిమా థియేటర్ లో వేసినప్పుడు టిక్కెట్ కొనే ముందు ప్రేక్షకులు కొనాలా వద్దా? ఈ సినిమా చూడాలా రెండు వారాలు ఆగాలా? అని ఆలోచించకుండా ఉంటారా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

రామాయణమైనా… ప్రేక్షకులకు అనుభూతి కలిగిస్తేనే..

రామాయణ, మహాభారతాల ఆధారంగా అనేక భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. అయినా ఇంకా తీస్తూనే ఉన్నారు. మరో వందేళ్ళ తర్వాత…

40 minutes ago

500+ Unreleased Films Exposed Online: Who’s Responsible?

A massive data leak at the Central Board of Film Certification (CBFC) has exposed records…

49 minutes ago