‘పోర్న్’ సినిమాల నుండి బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్ ఇప్పటికే పలు సినిమాలలో హాట్ హాట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో హాట్ హీరోయిన్ గానే కాకుండా వివిధ రంగాల్లో తన ప్రతిభను చాటిచెప్పే భాగంగా టీవీ హోస్ట్ గా, ఓ పాప్ సాంగ్ కు చిందేసి డ్యాన్సుల పరంగా కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా రచయితగా నిరూపించుకునేందుకు సిద్ధమైంది.
‘జుగర్ నట్స్ బుక్స్’ అనే యాప్ తనను కథలు రాయాలని కోరినప్పుడు తొలుత ఆశ్చర్యపోయినా రాస్తానని చెప్పానని తెలిపింది. ఇప్పటికీ ‘స్వీట్ డ్రీమ్స్’ పేరుతో 12 కథలు రాశానని, తనకు అప్పుడప్పుడు కొన్ని ఆలోచనలు వస్తుండేవని, వాటిని కథలుగా రాయాలన్న కోరిక కూడా ఉండేదని, అయితే అప్పట్లో రాయడం కుదరలేదని పేర్కొంది. అయితే ప్రస్తుతం తాను రాస్తున్న కథలు ‘ఎరోటిక్ ఫిక్షన్’గా అలరిస్తాయని చెప్పింది.
అంటే శృంగారంతో కూడిన ‘అడల్ట్’ కధలను తన కలంతో చెక్కబోతున్నట్లు సన్నీ చెప్పకనే చెప్పింది. అన్ని రంగాలలోనూ ప్రావీణ్యతను చూపిస్తూ బాలీవుడ్ వర్గాల చేత ‘సకలకళావల్లభన్’ అని పిలిపించుకుంటుందో ఏమో గానీ, ‘ఎరోటిక్’ కధలంటే సాధారణంగా ఉండవు కదా అంటున్నారు శృంగార ప్రియులు.



