దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోయే సినిమా కోసం అభిమానులు ఎంతగా నిరీక్షిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే మహేష్ కు సంబంధించిన ఎనిమిది లుక్స్ ను జక్కన్న ఓకే చేసారని సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియా లో కూడా వైరల్ అవుతోన్న విషయం.
అయితే ఆ ఎనిమిది లుక్స్ లో ఒక్క లుక్ అయినా బయటకు వస్తుందేమోనని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న సమయంలో మహేష్ బాబు ఓ చిన్న టీజింగ్ లుక్ ను రిలీజ్ చేసారు. అది రాజమౌళి సినిమా లుక్ కు సంబంధించినది కాకపోయినప్పటికీ, ఈ పిక్ లో సూపర్ స్టార్ అదిరిపోయే విధంగా ఉండడంతో ఫ్యాన్స్ కు శివరాత్రి పర్వదినం ప్రారంభమయినట్లయ్యింది.
త్రివిక్రమ్ ‘గుంటూరు కారం’ ఫలితంతో నిరాశ చెందిన సూపర్ స్టార్ అభిమానులు, సోషల్ మీడియాలో ఈ పిక్ ను షేర్ చేసుకుంటూ ఆ అనుభూతులను మరిచిపోతున్నారు. పిక్ అలా ఉంది మరి! రోజు రోజుకు వయసు తగ్గిపోయే విధంగా కనపడుతోన్న మహేష్ బాబు, హీనపక్షంగా మరో మూడేళ్ళ పాటు సిల్వర్ స్క్రీన్ స్క్రీన్ కు దూరం కానున్న విషయం తెలిసిందే.
అయితే అప్పటివరకు ఇలా టీజింగ్ లుక్స్ తో ఫ్యాన్స్ ను ”పండగ స్పెషల్స్” ఇస్తే అభిమానులకు అంతకు మించిన ఆనందం ఏముంటుంది! సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ఈ లుక్ పై మీరూ ఓ లుక్కేయండి!




