Telugu

నిజాయితీకి దక్కిన మద్దతు ఇది..!

సీతను కలవడానికి లంకకు వెళ్లిన హనుమంతుని తోకకు నిప్పంటించి రావణ సైన్యం త్రుటి కాలం పాటు సంతోషించింది. అయితే ఆ నిప్పుతోనే ఆంజనేయుడు తన లంకని తగలబెడతాడు అనే కటిక వాస్తవాన్ని ఊహించలేక పోయారు లంక సైన్యం. ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీ సైన్యం అనుభవిస్తుంది.

జగన్ తాను విదేశాలలో ఉండి ఏపీలో., టీడీపీ పార్టీలో పెట్టిన నిప్పుకి సెగ వైసీపీ కి ఇప్పుడు తాకుతున్నట్టుంది. ప్రముఖులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి బాబు అరెస్టును ఖండిస్తూ తనకు, తన కుటుంబానికి తమ మద్దతును తెలియచేస్తున్నారు. మొన్న మమతా బెనర్జీ, నిన్న అఖిలేష్ యాదవ్, కుమార స్వామి…తాజాగా పొరుగు రాష్ట్రమైనా తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు రేణుక చౌదరి..,ఏపీ కాంగ్రెస్ నేతలు ఇలా ఒక్కొక్కరుగా ముందుకొచ్చి జగన్ చేస్తున్న అరాచకాన్ని ఖండిస్తున్నారు.

ADVERTISEMENT

ఈ అక్రమ్ అరెస్టును ఖండించిన ప్రముఖులలో మొదటివారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ వైజాగ్ నోవోటల్ హోటల్ లో పవన్ ను గృహ నిర్బంధంలో ఉంచినప్పుడు కూడా చంద్రబాబు పవన్ కు తన మద్దతుని తెలియ చేసారు. అలాగే విజయవాడలో వ్యక్తిగతంగా కలిసి మాట్లాడి తమ పార్టీ తరుపున పవన్ కు సంఘీభావం తెలిపారు.

వైసీపీ నిరంకుశత్వ పాలనకు వ్యతిరేఖంగా ప్రజాస్వామ్య వాదులంతా కలిసి రావాలని ఆనాడే బాబు మీడియా ముఖంగా తెలియచేసారు. ఇప్పుడు పవన్ కూడా అదే ధోరణిలో ఉన్నారు. జగన్ ప్రభుత్వం బాబు పై మోపిన అక్రమ కేసుల విషయంలో బాబుని కలవడానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్తున్నారు పవన్. బాబుతో ములాఖత్ కి జైలు సిబ్బంది నుండి అనుమతి కోరడం జరిగింది. అయితే రాజమండ్రిలో బస చేస్తున్న లోకేష్ ని కూడా కలిసి తన మద్దతుని తెలియచేస్తారని సమాచారం.

అయితే జగన్ చేసిన ఈ దుష్కర్మ వలన పొత్తులు ఉంటాయా లేదా? కలిసి పోటీ చేస్తారా విడిగానా? అనే ప్రశ్నకు కొంతవరకు టీడీపీ, జనసేన రెండు పార్టీల క్యాడర్ కు సమాధానం వచ్చినట్టే భావించాలి. అయితే ఇప్పుడు రాజకీయ పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదు కానీ దేనినైనా రాజకీయాలతో ముడి పెట్టి చూసే కళ్ళకు మల్లి నోర్లు లెగుస్తాయి అనడంలో సందేహమే లేదు.

దేశంలోనే ప్రముఖ నటులలోనే ఒకరైన రజనీకాంత్ కూడా చంద్రబాబు అరెస్ట్ పై స్పందిస్తూ లోకేష్ కు ఫోన్ చేసి బాబుకి తన మద్దతుని ప్రకటించారు. వైసీపీ నేతల బూతుల పంచాంగాన్ని చూసి కూడా రజనీకాంత్ ఒక అన్యాయాన్ని ఎదిరించడానికి హిట్లర్ మనస్తత్వంతో ఉన్న జగన్ కు వ్యతిరేకంగా తన సంఘీభావాన్ని ప్రకటించడం హర్షణీయం.ఈ రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేకపోయినా రజనీకాంత్ స్పందించిన తీరుకు నువ్వు ‘రియల్ హీరోవి “తలైవా” అంటూ టీడీపీ శ్రేణులు అభినందనలు తెలుపుతున్నారు.

ఒకప్పుడు దేశ రాజకీయాలలో చక్రం తిప్పిన చాణుక్యుడిగా ఉన్న చంద్రబాబు ఇటువంటి వాటికి కుంగిపోతారు అని ఆలోచించడం జగన్ వెర్రితనే అవుతుంది. ఇది చంద్రబాబుకి దక్కిన మద్దతుకాదు ఆయన విజనరీ లీడర్ షిప్ కు., నిజాయితీకి దక్కిన మద్దతుగా భావించాలి. ఈ గౌరవం – అభిమానం ఒక్క రోజులో సంపాదించుకున్నది కాదు నాలుగున్నరేళ్ళ దశాబ్దాల కష్టం., శ్రమ అనేది ఈ వైసీపీ నేతలకు అర్ధం కాదు.

జగన్ అరెస్ట్ అయినా సందర్భంలో ఇటువంటి ఖండనలు., కానీ మద్దతులు కానీ రాకపోవడం తో ఈ పరిస్థితులను జీర్ణించుకువడానికి జగన్ కు కొంత సమయం పడుతుంది. ఒక నిజాయితీకి దక్కిన గౌరవానికి – అవినీతికి ఉన్న బలానికి మధ్య జరిగే పోటీలో ఎప్పటికైనా నిజాయితీనే గెలుస్తుంది అని ఆశించడమే.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Rajinikanth-Vidya Balan Flirting: What Was Nelson Thinking?

Right from the first show of Rajinikanth's anticipated sequel Jailer 2, social media has been…

21 minutes ago

Pics: Vaani Brings A Bold Edge To Ethnic Elegance

Vaani Kapoor brings a rich, moody twist to festive dressing in this striking navy and…

41 minutes ago